💥వదినతో అలా చేసిన మరిది..బాబాయ్ ని హత్య చేసిన వదిన కుమారులు
👉వివరాలు తెలిపిన మన గద్వాల సీఐ గా విధులు నిర్వహించి నాగర్ కర్నూల్ కు బదిలీ ఐనా జక్కుల హనుమంతు సార్
నాగర్ కర్నూల్: సొంత అన్న భార్య అని కూడా చూడలేదు. ఆమె ఒంటరిగా ఉంది చూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి ఆమె కొడుకుల చేతిలో హతమయ్యాడు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం గడ్డంపల్లిలో చోటుచేసుకుంది. సీఐ జక్కుల హనుమంతు తెలిపిన వివరాల ప్రకారం.. మిద్దె మాసయ్య, చంద్రయ్య(48)లు ఇద్దరు సొంత అన్నదమ్ములు. తమ్ముడు చంద్రయ్య అన్న భార్య లక్ష్మమ్మపై కన్నేశాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా లక్ష్మమ్మపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. అయితే మరిది ప్రవర్తనతో తీవ్ర షాక్ కు గురైన వదిన లక్ష్మమ్మ.. ఈ విషయాన్ని హైదరాబాద్ లో ఉంటున్న తన కొడుకులు నాగరాజు, మల్లేశ్ లకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో హుటాహుటిన గ్రామానికి వచ్చిన లక్ష్మమ్మ కొడుకులు.. శనివారం ఉదయం తమ తల్లిని అత్యాచారం చేసిన చంద్రయ్యతో గొడవకు దిగారు. మాట మాట పెరిగి కోపంతో వాళ్లు చంద్రయ్య తలపై కర్రలతో కొట్టారు. తీవ్ర రక్తస్రావం కావడంతో గమనించిన చుట్టు పక్కలవాళ్లు చంద్రయ్యను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. మార్గమధ్యంలోనే అతడు చనిపోయాడు. విషయం తెలుసుకున్న సీఐ జక్కుల హనుమంతు నేతృత్వంలోని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేశారు. అనంతరం మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్ కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి భార్య రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులు నాగరాజు, మల్లేశ్ లపై పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.