అయ్యప్పలకు అన్నదానం మహాభాగ్యం
షాద్ నగర్ టిఆర్ఎస్ యువ నాయకులు మహ్మద్ ఎజాజ్
శివ మారుతి గీతా అయ్యప్ప మందిరంలో స్వాములకు భిక్ష
షాద్ నగర్, : మాలధారణ చేసిన అయ్యప్ప భక్తులు కఠిన నియయాలతో దీక్ష చేస్తారని, ఉదయాష్టమ సంధ్యలలో స్వామికి పూజలు చేస్తూ ఏకభుక్తం తింటూ 41 రోజుల పాటు దీక్షను కొనసాగిస్తారని అలాంటి భక్తులకు అన్నదానం చేయడం మహా భాగ్యమని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ టిఆర్ఎస్ యువ నాయకుడు మహమ్మద్ ఏజాజ్ (అడ్డు) అన్నారు. శనివారం పట్టణంలోని శ్రీ శివ మారుతి గీత అయ్యప్ప మందిరంలో అయ్యప్ప భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యాహ్న భిక్షను ఆయన స్వయంగా స్వాములకు వడ్డించారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఏజాజ్ మాట్లాడుతూ.. కఠిన నిమయాల్లో భిక్షకు అధిక ప్రాధాన్యత ఉందని దీన్ని ఎక్కడబడితే అక్కడ చేయరాదని దైవ సన్నిధిలో ఎంతో నిష్ఠగా వడ్డించాలని పేర్కొన్నారు. దీక్షలో ఉన్న భక్తులకు అన్నదానం చేయడానికి చాలా మంది ముందుకు వస్తారని దీని వల్ల వ్యక్తిగత పనుల కోసం దూర ప్రాంతాల నుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భిక్ష చేసే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ఇలాంటి భక్తులకు వివిధ నగరాలు, పట్టణాల్లో దాతల సహకారంతో ఉచిత అన్నదానం నిర్వహిస్తున్నారని, ఏళ్లుగా సాగుతున్న ఈ కార్యక్రమం లక్షలాది భక్తులకు ఎంతో ఉపయోగపడుతుందని, అయ్యప్ప భక్త సమాజానికి తాను ధన్యవాదాలు తెలిపారు. ఎంతో గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి స్వాములకు భిక్ష చేసే మహాభాగ్యాన్ని అందరికీ దాతల ద్వారా కల్పించడం మహా ప్రసాదం అని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్త సమాజం నాయకులు మోముల బసప్ప, కౌన్సిలర్లు నందీశ్వర్, ప్రతాప్ రెడ్డి, రాజా వరప్రసాద్, గోలెపు శేఖర్, మురళి, బొబ్బిలి ప్రవీణ్, శ్రావణ్ పట్వారి, రాజుగౌడ్, బాలాజీ బళ్ళు, శివకుమార్, రాజమోని గోపాల్, నిజాం, షబ్బీర్, అంజి, శేఖర్, దేవేందర్, గోపి, సాదక్, రియాజ్, చింటూ తదితరులు పాల్గొన్నారు.