హెచ్ఐవి ఎయిడ్స్ మరియు టిబి వ్యాధులపై వీధి నాటకాల ద్వారా అవగాహన కార్యక్రమం
స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్ 25, మహానంది:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ కర్నూలు మరియు నంద్యాల జిల్లా వారు కళాజాత బృందాలతో వీధి నాటకముల ద్వారా మహానంది మండలం తిమ్మాపురం గ్రామ కళాకారుల చేత వీధి నాటకాల ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ పై తిమ్మాపురం పీహెచ్ సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ రూపేంద్ర నాథ్ రెడ్డి, ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు.ఈ నాటకం ద్వారా హెచ్ఐవి వ్యాధి ఎలా వస్తుంది ఎలా రాదు? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత, చిన్న చూపు లేకుండా ఎలాగ సమాజంలో కలిసి జీవించాలి. అదేవిధంగా క్షయ సుఖ వ్యాధులు, కండోమ్(నిరోధ్) యొక్క ఉపయోగాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నటరాజ్ యూత్ అసోసియేషన్ చిన్న కాశి, చైల్డ్ ఫండ్ ఇండియా సూపర్వైజర్ రామకృష్ణ, సురేష్, మీరం రెడ్డి లింక్ వర్కర్ చంద్రశేఖర్, శంభు ప్రసాద్ కళాజాత బృందం వైద్య సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.