వెస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు ప్రజలకు ఎంతో ఉపయోగకరం : ఎమ్మెల్యే భూమన, ఎంపీ గురుమూర్తి
తిరుపతి
తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ ముందర నుండి క్యాపంస్ స్కూల్ వెనుక వైపుగుంట పధ్మావతి హైస్కూల్ ముందర రోడ్డులో కలిసే ప్రతిపాదిత రోడ్డు రావడం వలన ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి అన్నారు. పడమర రైల్వే స్టేషన్ ముందర నూతనంగా ఏర్పడే రహదారి యొక్క స్థలాన్ని ఎమ్మెల్యే భూమనతో కలిసి ఎంపీ గురుమూర్తి బుధవారం సాయంత్రం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెస్ట్ రైల్వే స్టేషన్ కు వెల్లే ప్రజలకు, అక్కడే వున్న రైల్వే కుటుంబాలకు, అదేవిధంగా ఎస్వీ యూనివర్సిటీలో ఏదైనా పెద్ద స్థాయిలో క్రీడలు, సమావేశాలు జరిగినప్పుడు ప్రజల రాకపోకలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేలా ఈ రహదారి నిర్మాణం ఉంటుందన్నారు. స్థానిక కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఏరియా డెవెలప్మెంట్లో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ప్రతిపాదించిన ఈ రోడ్డును నిర్మించడం వలన వలన వెస్ట్ రైల్వే స్టేషన్ కి మరింత ఖ్యాతి రావడంతోబాటు ప్రజలకు చాలా సౌకర్యవంతంగా వుంటుందన్నారు.