యానాది కుటుంబాల కన్నీటి గాధ. బర్ల
సీతానగరం మండలం వంగలపూడి గ్రామ శివారుణ సుమారుగా మూడు కిలోమీటర్లు అవతల ఎస్టి కులానికి చెందిన 30 కుటుంబాలు కనీస మౌలిక సదుపాయాలు లేక అల్లాడిపోతూ ఉన్నాయి కారణం వంగలపూడి గ్రామంలో ఊరుమధ్య ఉన్న యానాదులను అగ్రవర్ణాలు నిర్ధాక్షణంగా ఊరి చివరకు పంపించడం జరిగింది. కానీ వ్యవసాయ భూమిగా ఉన్న ఆ స్థలంలో మెరక చేయలేదు అయినా పెద్దలకు ఎదురు చెప్పలేక ఆ కుటుంబాలన్నీ వారి చెప్పిన చోటికి వెళ్లి నివాసం ఉంటూ అష్ట కష్టాలు పడుతున్నారు. వీరి సమస్యలపై గతంలో బర్ల చేసిన పోరాటానికి కరెంటు మంచినీటి సౌకర్యం కలిగింది మరియు ఇల్లులు నిర్మాణం చేసి ఇస్తానన్న హామీ నేటికి నెరవేర్చక వర్షం వస్తే ఆ నీటిలోనే నరకం చూస్తూ కాలం గడుపుతున్నారు. తక్షణం వారికి ఇంటి నిర్మాణాలు పూర్తి చేసి ఇల్లులు ఇప్పించాలని అలాగే చాలామందికి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ ఐడి ఈ మూడు కూడా తక్షణ ఇప్పించి ఆదుకోవాలని లేని పక్షంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని తెలుగుదేశం పార్టీ బీసీ నేత బర్ల బాబురావు తెలియజేశారు