గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్ 17, మహానంది:
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజా ప్రతినిధుల్ని ప్రజలకు మరింత చేరువ చేసిందని ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతృప్తి కరంగా ఉన్నారని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పేర్కొన్నారు. మహానంది మండలం నందిపల్లి గ్రామంలోని గురువారం ఎమ్మెల్యే శిల్పా ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం, సమసమాజం ఆచరణలో అమలుచేస్తున్న ఆదర్శనాయకుడు జగనన్న అని అన్నారు. మాటిస్తే అమలుచేసి తీరుతాడన్న నమ్మకాన్ని ప్రజల్లో నిలుపుకున్న నేత మన జగనన్న అని. సంక్షేమ కార్యక్రమాల వెల్లువను సృష్టించిన ఘనత దేశచరిత్రలో ఒకే ఒక్కనికి దక్కుతుందని.అతడే మన ముఖ్యమంత్రి జగనన్న అని అన్నారు. జగనన్న జన హృదయాల్లో సుస్థిరస్థానం పొందారని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్పష్టంగా తెలుస్తుందని అన్నారు.అనంతరం జగనన్న ప్రభుత్వంలో పంటలు బాగా పడినందుకు నాగలి గుర్తుగా సాగేశ్వర్ రెడ్డి అనే రైతు ఎమ్మెల్యే శిల్పా కి అందజేశారు.ఈకార్యక్రమంలో మండల అధ్యక్షు రాలు బుడ్డారెడ్డి యశస్విని, దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్, మండల కన్వీనర్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి,మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ శరభ రెడ్డి,మహానంది జెడ్పీటీసీ వెంకటేశ్వర్లు, దేవస్థానం ధర్మకర్త వీరభద్రుడు, తాసిల్దార్ జనార్దన్ శెట్టి,విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి, ఎస్ఐ నాగార్జున రెడ్డి,రాష్ట్ర ఉత్తమ అవార్డు గ్రహీత సాగేశ్వర్ రెడ్డి,పెద్దమహానంది రెడ్డి, గోపవరం కృష్ణారెడ్డి, బొల్లవరం మాజీ ధర్మకర్త బండి శ్రీనివాసులు, అశోక్ రెడ్డి,మండల, గ్రామ వైసిపి నాయకులు,సచివాలయ సిబ్బంది వాలంటీర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.