విద్యుత్ లైన్ నిర్మాణంలో కరెంట్ షాక్ – వ్యక్తి మృతి.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం
సీతానగరం మండలం
జగనన్న పేదలందరికీ ఇళ్ళ నిర్మాణ కాలనీలో విద్యుత్ లైన్ నిర్మాణంలో కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కాలనీలో విద్యుత్ లైన్ నిర్మాణానికి గుత్తెదారుడు వెస్ట్ బెంగాల్ నుండి 14 మంది కార్మికులు పురుషోత్తపట్నం పంచాయతీ పరిధిలో రామచంద్రపురం జగనన్న కాలనీల్లో విద్యుత్ స్తంభాలపై పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం 9:39 కి విద్యుత్ సబ్ స్టేషన్ నుండి ఎల్.సి తీసుకుని జంపర్లు విప్పి ఎల్.సి తిరిగి వెనక్కి తీసుకుని పని చేస్తున్నారు. మధ్యాహ్నం భోజనం తరువాత విద్యుత్ స్తంభాలు పైకి ఎక్కి పనిచేస్తూ ప్రమాదవశాస్తూ కరెంటు షాక్ కి గురై లాల్ ముండా అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. వెస్ట్ బెంగాల్ మల్దా టౌన్ లో నారాయణ్ పూర్ పారాదిగి గ్రామం. మృతుని వయసు 31 సంవత్సరాలు. భార్య, ఒక ఆడ పిల్ల, మగ బిడ్డ ఉన్నారు. విద్యుత్ లైన్ నిర్మాణంలో గుత్తెదారు రక్షణ కొరకు ఎర్త్ పోల్స్ వాడలి. జాగ్రత్తలు పాటించకుండా ఉండటంతొ కార్మికుడు షాక్ గురై మృతి చెందాడు. సీతానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శుభ శేఖర్ తెలిపారు.