ప్రజా ప్రతినిధులకు తెలియకుండా అధికారులు సమావేశాలు నిర్వహించరాదు
స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్ 14, మహానంది:
గ్రామాల్లో ఉన్న సర్పంచులు మరియు ప్రజాప్రతినిధులకు తెలియకుండా అధికారులు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని మండల అధ్యక్షురాలు బుడ్డారెడ్డి యశస్విని అన్నారు.
మహానంది మండలంలోని మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం బుక్కాపురం గ్రామంలోని మండల మహిళా సమైక్య కార్యాలయంలో మండల అధ్యక్షురాలు బుడ్డారెడ్డి యశస్విని ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగనవాడి కేంద్రాల్లో గర్భవతులకు, బాలింతలకు, పిల్లలకు సరైన పోషక ఆహారాన్ని అందజేయడంలో ఫిర్యాదులు వస్తున్నాయి అన్నారు. ఆయా గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు అధికారులు పరిశీలించి ఆరాతీస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అందరం కలిసి మండలాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్దామన్నారు. పొదుపు లక్ష్మి సభ్యులు కట్టిన రుణాలు రికవరీలో విఓఏలు కొన్ని, సభ్యులు కొన్ని డబ్బులు వాడుకుంటున్నారని అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలన్నారు. తదుపరి ఆయా శాఖల అధికారులు తమ అభివృద్ధి నివేదికలను వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి కెవిఆర్ మహేశ్వర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షురాలు పుంచేపు లక్ష్మీనరసమ్మ, పి ఆర్ ఏ ఈ రాముడు, మండల వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వర్ రెడ్డి, విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి రామసుబ్బయ్య, ఏపీవో మనోహర్ తదితరులు పాల్గొన్నారు.