మోడీ గో బ్యాక్ గో మోడీ బ్యాక్ ….సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి పలివెల నిరసన
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం
సీతానగరం : ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనను నిరసిస్తూ సిపిఐ ఎంఎల్ పార్టీ శుక్రవారం నిరసన తెలియజేశారు. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి పలివెల వీరబాబు మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేసి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారని విమర్శించారు. నరేంద్ర మోడీ దేశాన్ని అంబానీ, అధానీలకు తాకట్టు పెట్టారని అన్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, ఉప్పు, పప్పు తో సహా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటి సామాన్యుడికి అందని ద్రాక్షలా మారాయని., దేశాన్ని ఇంత సంక్షోభంలోకి నెట్టేసిన ఘనత మోడీకే దక్కుతుందని అన్నారు. బిజెపి పాలనలో దేశం 50 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ, ప్రత్యేక ప్యాకేజీ కానీ ప్రకటించకుండా నూతనంగా ఏర్పాటైన ఆంధ్ర రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అనాధను చేసిందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించని నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్ర పర్యటనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో