మండలస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం
స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్ 11, మహానంది:
మహానంది మండలంలోని బుక్కాపురం గ్రామంలో మండలస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశము శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి టి.మోహన్ రావు మాట్లాడుతూ ఈ సమావేశంలో సభ్యులు చెప్పిన విషయాలను తీర్మానం రూపంలో ప్రభుత్వానికి పంపి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు.అదేవిధంగా మహానంది మండలంలో పంట నమోదు కార్యక్రమం పూర్తి అయిందని, సోషియల్ ఆడిట్, గ్రామసభలు కూడా నిర్వహించామని తెలియజేశారు.రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా తక్కువ ఖర్చుతో ఆరోగ్యకరమైన మరియు నాణ్యమైన దిగుబడులు పొందాలని తెలియజేశారు.మహానంది వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్లు విజయభాస్కర్ మరియు రాహుల్ మాట్లాడుతూ వివిధ పంటలలో సస్యరక్షణ పద్ధతుల గురించి రైతులకు వివరించారు. ఏపీ సీఎన్ ఎఫ్ డిపిఎం నరేంద్ర కుమార్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో మూడు గ్రామాలలో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం చేపడుతున్నామని, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి ప్రకృతి వ్యవసాయంలో మెలకువలను తెలియజేస్తారని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి బి. నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా పడని రైతులు మరియు పొలం లేని సి సి ఆర్ సి కార్డ్స్ తీసుకున్న కౌలు రైతులు రైతు భరోసా కొరకు సంబంధిత రైతు భరోసా కేంద్రాలలో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పీఎం కిసాన్ కొరకు వెంటనే ఈకేవైసీ చేసుకోవాలన్నారు. వెటర్నరీ డాక్టర్ కరుణాకర్ మాట్లాడుతూ పశువులలో వచ్చే వ్యాధుల నివారణ గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బుక్కాపురం గ్రామ సర్పంచ్ వరలక్ష్మి, నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రావు, నంద్యాల జిల్లా ఏపీ సీఎన్ ఎఫ్ డిపిఎం నరేంద్ర కుమార్ రెడ్డి,మహానంది వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్లు విజయభాస్కర్, రాహుల్, మండల వ్యవసాయ అధికారి నాగేశ్వర రెడ్డి, పశుసంవర్ధక శాఖ అధికారి కరుణాకర్, వీఆర్వో క్రిస్టియానమ్మ, ఏ ఈ ఓ శ్రీనివాసరెడ్డి, రైతు భరోసా కేంద్ర సిబ్బంది మౌనిక , మధు, రైతులు పాల్గొన్నారు.