మహానంది క్షేత్రంలో అన్నదాన కార్యక్రమానికి 100 బస్తాల వరి ధాన్యం సేకరణ
స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్ 10, మహానంది:
మహానంది క్షేత్రంలో అమలవుతున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి 100 బస్తాల వరి ధాన్యం సేకరణ.మహానంది దేవస్థానం కార్యనిర్వాహణా ధికారి కాపు చంద్రశేఖర్ రెడ్డి మరియు ఆలయ చైర్మన్ కొమ్మ మహేశ్వర్ రెడ్డి గ్రామంలోకి వచ్చి రైతులను ధాన్యం ఇవ్వాలని కోరగా వెంటనే రైతులు ఏమి ఆలోచించకుండా . బొల్లవరం గ్రామంలోని రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిత్య అన్నదాన కార్యక్రమానికి తమ వంతుగా 100 బస్తాల ధాన్యాన్ని వితరణ చేయడానికి ముందుకు వచ్చారు.గ్రామంలోని పలువురు రైతులు ఈవో వెంట గ్రామంలో తిరుగుతూ ఇతర రైతులను తమ వంతు సహాయం నిత్య అన్నదాన కార్యక్రమానికి చేయాలని సూచించారు. మహానంది మండలంలో నీ అన్ని గ్రామాల్లోనిత్య అన్నదాన కార్యక్రమానికి ధాన్యం సేకరణకు సంబంధించి బొల్లవరం గ్రామం నుండి ప్రారంభించి నట్లు తెలిపారు.బండి శీను, బండి రమణ కిలారి వెంకటేశ్వర్లు, మేకల వెంకటసుబ్బయ్య, టి సుబ్బారావు, గాజుల వెంకట్ రాముడు, పలువురు నాయకులు గ్రామస్తులు ఈ కార్యక్రమానికి సహకరించినందుకు ఆలయ అధికారి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని చేపడతామన్నారు .