తమిళిసైని టార్గెట్‌ చేసిన డీఎంకే

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్‌ తమిళిసై మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి.. ఇప్పుడు గవర్నర్‌ తమిళిసైని తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ టార్గెట్‌ చేసింది..

తెలంగాణలో ప్రభుత్వం తమిళిసైని పట్టించుకోవడం లేదని.. అందుకే చెన్నైలో కాలం గడుపుతున్నారని విమర్శించింది డీఎంకే.. దీనిపై స్పందించిన గవర్నర్‌.. ఇంట్లో తెలుగు మాట్లాడుతూ.. తమిళ వేశం వేస్తున్నారని ఎద్దేవా చేశారు.. మీకు తెలుగు మూలాలు ఉన్నాయి.. మీరా నాపై విమర్శలు చేసేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని డీఎంకేకు సూచించిన గవర్నర్‌.. తెలంగాణ అసెంబ్లీలో తిరుక్కురల్‌ సూక్తిని పాటించానని తెలిపారు.. ఇదంతా డీఎంకే నేతలకు కనబడడంలేదా? అని ప్రశ్నించారు. అటు తమిళిసై విమర్శలపై స్పందించిన డీఎంకే.. అగ్నిపర్వంతో తమిళిసై చెలగాటం ఆడొద్దని కౌంటర్‌ ఇచ్చారు.

అయితే, హిమాలయాల ముందు అగ్నిపర్వతాలు ఏమీ చేయలేవని.. సాలె పురుగులు సింహాలను ఏమీ చేయలేవంటూ ధీటుగా బదులిచ్చారు గవర్నర్‌ తమిళిసై.

ఇక, డీఎంకే నేతల్ని జలగల వేషం వేసుకున్న నల్లులతో పోల్చారు తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై.. తెలుగు మాట్లాడుతూ తమిళ వేషం వేసినవారా నన్ను విమర్శించేది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.. ఓ తెలుగు రాష్ట్రానికి గవర్నర్‌గా ఉన్న తమిళిసై.. తెలుగు మాట్లాడేవారు తనను విమర్శిస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.. కాగా, డీఎంకే అధికార పత్రిక అయిన ‘మురసొలి’లో ”గవర్నర్లూ! అగ్ని పర్వతాలతో చెలగాటం వద్దు” శీర్షికన ఓ వ్యాసం ప్రచురితమైంది.. తమిళిసైని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆమె చెన్నైలోనే కాలం గడుపుతున్నారంటూ ఎద్దేవా చేశారు.. దీనిపై సోషల్‌ మీడియా వేదికగా కౌంటర్‌ ఇచ్చిన గవర్నర్‌..తెలంగాణలో ఏమి జరుగుతోందో పూర్తిగా తెలుసుకుని మాట్లాడండి. తెలుగు మూలాలు ఉండి, ఇంట్లో ఆ భాష మాట్లాడుతూ తమిళ వేషం వేసినవారు.. గవర్నర్‌గా తెలంగాణ శాసనసభలో తమిళంలో తిరుక్కురళ్‌ సూక్తిని పఠించిన తమిళ వనితను నేనన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.. గత మూడేళ్లుగా తెలంగాణ స్థానిక పత్రికల్లో వచ్చిన వార్తలను పరిశీలిస్తే ఎవరు భయపడుతున్నారో? ఎవరు ధైర్యంగా ఉన్నారో మీకు తెలుస్తుంది. నాకు సమాధానం చెప్పడానికి పాలకులు, కుటుంబవారసులు, మంత్రులు కంకణం కట్టుకుని బారులు తీరి నిలిచి ఉండటమే ఇందుకు సాక్ష్యం అంటూ రాసుకొచ్చారు..

అంతేకాదు.. నేను చేతులు ముడుచుకుని ఉన్నట్లు కలలు కంటున్నారా? తెలంగాణలో ఫామ్‌హౌస్‌లో జరిగే వారసత్వ రాజకీయాలతో కూడిన ప్రభుత్వం గురించి ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించడం వల్లనే వారికి రాజ్‌భవన్‌పై కోపం వచ్చిందంటూ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు తమిళిసై.. మిమ్మల్ని మీరు అగ్ని పర్వతాలుగా ప్రకటించుకోవడం చాలా సంతోషం. అదే సమయంలో ఆ అగ్ని పర్వతాలు హిమాలయాలను ఏమి చేయలేవనే వాస్తవాన్ని గమనించాలని హితవుపలికిన ఆమె.. మురసొలి తాటాకు చప్పుళ్లకు మేం భయపడం.. ఉరుములు, మెరుపులు, పిడుగులే మమ్మల్ని ఏం చేయనప్పుడు కేవలం మురసొలి మమ్మల్ని ఏం చేయగలదు? సాలెపురుగులు సింహాలను ఏం చేయగలవు? అంటూ డీఎంకేపై ఫైర్‌ అయ్యారు తమిళిసై.. మొత్తంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్‌ తమిళిసై మధ్య ఉన్న గ్యాప్‌ కాస్తా… తమిళిసై స్వరాష్ట్రంలో ఆమెపై విమర్శలకు దారితీస్తోంది.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!