ప్రజా సంక్షేమమే జగనన్న లక్ష్యం

ప్రజా సంక్షేమమే జగనన్న లక్ష్యం

స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్ 06, మహానంది:

ప్రజా సంక్షేమమే ముఖ్యమంత్రి వైయస్ జగనన్న లక్ష్యమని శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయా త్రకు ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం మహానంది మండల పరిధిలోని గోపవరం గ్రామ సమీపంలోని మానసిక వికలాంగుల కేంద్రంలో శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా భువనే శ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైయ స్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు.అనంతరం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కుమారుడు శిల్పా కార్తీక్ రెడ్డి జన్మదిన వేడుకలను వైసిపి నాయకులు కేక్ ను కట్ చేసి పిల్లలకు స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకొని,గాజులపల్లి గ్రామానికి చెందిన గజ్జ పెద్ద పక్కిరయ్య స్కూల్ విద్యార్థుల కోసం ప్రిన్సిపల్ రీనాకి 5000వేల రూపాయలు విరాళంగా అందజేశారు.ఈ సందర్భంగా పలువురు వైసిపి నాయకులు మాట్లాడు తూ మాటతప్పని, మడమ తిప్పని నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాల పథకాలను ప్రవేశపెట్టి పేదల సంక్షేమా భివృద్ధికి పాటు పడుతున్నాడన్నారు.తండ్రికి మించిన తనయుడుగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకుడు కొండా మధుసూదన్ రెడ్డి, గోపవరం అశోక్,మహానంది దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్, మండల కన్వీనర్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి, గజ్జ పెద్ద పకీరయ్య, బండి శ్రీనువాసులు, స్కూల్ ప్రిన్సిపల్ రీనా తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!