సాగుకు అనుకూలమైన ప్రభుత్వ, బంజరు, అటవీ భూములు పేదలకు పంచండి
స్టూడియో 10 టీవీ న్యూస్ నవంబర్ 06, మహానంది:
మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు కోటకొండ భాష అధ్యక్షతన ఆదివారం మహాసభ నిర్వ హించారు.ఈ మహాసభలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు డి సద్దాం హుస్సేన్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి రామచంద్రుడు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి ప్రజలందరి పైన భారాలు పడుతున్నవి. వ్యవసా యంలో రోజు రోజుకు పెరుగుతున్న యాంత్రీకరణ వల్ల కూలీల పని దినాలు తగ్గిపోతున్నాయని. చాలీచాలని కూలీ డబ్బులతో, పెరిగిన ధరలతో కుటుంబాలు గడపడం చాలా కష్టంగా ఉంది.ఉపాధి హామీ పథకంలో కూడా పని దినాలు తగ్గిపోతు న్నాయి,చాలామంది కూలీలకు నివసించడానికి సొంత ఇల్లు లేక జీవనం సాగిస్తున్నారు. సొంత స్థలంలో పక్కా గృహం నిర్మించుకుందామంటే ప్రభుత్వ బిల్డింగులు రావటం లేదు. ఇప్పటికే కట్టుకున్న వాటికి బిల్లులు రావడం లేదు. కావున వ్యవసాయ కార్మికుల జీవితాల్లో నా మార్పులు రావాలంటే ప్రభుత్వాలు సమగ్ర భూ పంపిణీ చేయాలని కోరారు. మహానంది మండలంలో అనేకమంది భూమిలేని నిరుపేదలు ఉన్నారని, తెలుగు గంగా ప్రధాన కాలువ వెంట సాగుకు అనుకూలమైన ప్రభుత్వ బంజరు, పోరంబోకు, అటవీ భూములు వేల ఎకరాలు ఉన్నాయని, వాటిని ధనవంతులు, భూస్వాములే అనుభవిస్తున్నారని వారు అన్నారు. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పేదల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న నిరుపేదలందరికీ సాగుకు అనుకూలమైన భూములు పంచాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అందుకు మండలంలోని పేదలందరూ సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం గడిచిన కార్యక్రమాల గురించి చర్చించి భవిష్యత్ పోరాట కార్యక్రమాల ప్లాన్ రూపొందించుకోన్నారు. అందుకు అవసరమైన సంఘం మండల కమిటీని ఏర్పరిచారు. ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి మద్దిలేటి, వ్యవసాయ కార్మిక సంఘం వివిధ గ్రామాల నాయకులు రమణ , నాగులు, పి వెంకట నరసింహుడు,తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన మండల కమిటీ అధ్యక్షుడిగా నాగులు, కార్యదర్శిగా భాష తోపాటు 11 మందితో కమిటీని ఎన్నుకున్నారు.