ప్రైవేట్ లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కృషి…
గత నెల గుండెపోటుతో మరణించిన ప్రైవేటు లెక్చరర్ కుటుంబానికి PTLU ఆధ్వర్యంలో లక్ష రూపాయల చెక్కును ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేతుల మీదుగా అందజేత..
శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో పనిచేస్తూ అకారణంగా ఉద్యోగం నుండి తొలగించిన కారణంగా మానసిక ఒత్తిడికి గురై మరణించిన తలారి ప్రదీప్ గారి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ (PTLU) నుండి లక్ష రూపాయలు నగదును ఆదివారం నాడు రాజమహేంద్రవరంలో ఎమ్మెల్యే శ్రీ జక్కంపూడి రాజా గారి చేతుల మీదుగా అందజేశారు..
ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ప్రైవేటు టీచర్లు, లెక్చరర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను రాజా గారికి వివరించారు.
ప్రైవేటు టీచర్లు లెక్చరర్స్ ఎవరైనా ఆకస్మిక మరణిస్తే వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వంతో మాట్లాడి ప్రైవేటు టీచర్లు,లెక్చరర్స్ సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వం నుండి ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి నష్టపోయిన కుటుంబాలకు ఆర్థిక సహకారం ప్రభుత్వ తరుపున అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రైవేటు లెక్చర్ల సమస్యలపై ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని మరోసారి జగన్మోహన్ దృష్టికి తీసుకెళ్లి త్వరిగతిన సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు..
రాష్ట్ర యూనియన్ సలహాదారి P.V.B సంజీవరావు మాట్లాడుతూ ప్రతి సభ్యుడికి ఎల్లవేళలా అసోసియేషన్ అండగా నిలబడుతుందని ఆయన తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు దిద్దే అంబేద్కర్,రాష్ట్ర కన్వీనర్ పెనుమత్స కిరణ్ కుమార్ రాజు,రాష్ట్ర యూనియన్ సలహాదారి P.V.B సంజీవరావు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు M. ఆనంద్ రాజ్ కుమార్,జిల్లా ప్రధాన కార్యదర్శి D. రమేష్ గారు మరియు M. శ్రీను బాబు ఉన్నారు.