త్వరలో మొదలయ్యే ఇసుక ర్యాంపులలో పేద కూలీలకు పని కల్పించాలి
లేకుంటే కూలీలకు అండగా నిలబడి ధర్నాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటానంటున్న- బర్ల
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం
సీతానగరం: – వంగలపూడి ప్రభుత్వ ఇసుక ర్యాంపు నందు జరిగిన మీడియా సమావేశంలో రాజానగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు బీసీ సంక్షేమ నేత బర్ల బాబురావు తెలియజేస్తూ త్వరలో మొదలవనున్న వంగలపూడి, కాటవరం.. వంటి గ్రామాల ఇసుక ర్యాంపులలో నిరుపేద కూలీలు పనిచేసుకునేందుకు సంబంధిత అధికారులు నాయకులు తప్పనిసరిగా పని కల్పించాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. మండలంలో పలు ఇసుక ర్యాంపులు దశాబ్దాలుగా మనుగడ సాగిస్తున్నాయని కూలీలకు ఉపాధి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో పేదవాడు పనిచేసుకునేందుకు ఇసుక ర్యాంపులలో లోడింగ్ పని కల్పించి వారి కుటుంబాలను పోషించుకునేందుకు సహకరించడం జరిగిందని తెలిపారు. అలాంటిది వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత జెసిపి మిషన్తో ఇసుక ర్యాంపుల యందు లోడింగ్ చేయడం వలన కూలీలు తమ కుటుంబాలను పోషించుకునేందుకు కష్టతరంగా మారిందని తెలియజేస్తున్నారని అన్నారు. పొరుగు రాష్ట్రాల నుండి వచ్చిన కూలీలకు మాత్రమే ఇక్కడ కొందరు రైతులు వ్యవసాయ పనిని కల్పిస్తూ స్థానిక కూలీలకు పని లేకుండా చేస్తున్నారని అన్నారు. కొందరు రైతులు ఇసుక ర్యాంపుల ద్వారా తమ కుటుంబాలను పోషించుకునేందుకు మండలంలో సుమారు 300 ట్రాక్టర్లు కొనుగోలు చేయడం వలన ఇసుక ర్యాంపులలో ఎటువంటి పని దొరకకపోవడంతో ఫైనాన్స్ లు కట్టుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారనీ తమ ఇంటి ఆడవాళ్ళ పుస్తుల సైతం తాకట్టు పెట్టి ఫైనాన్సులు కట్టుకునే పరిస్థితులు తప్పడం లేదని అన్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు నాయకులు స్పందించి పేదవాడు బ్రతికేందుకు ఇసుక ర్యాంపులలో పని కల్పించాలని లేని పక్షాన కూలీలకు అండగా నిలబడి ఉద్యమాలు చేయడానికైనా వెనుకాడ బోనని బర్ల అన్నారు. కోవిడ్ సమయంలో ప్రజలు ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారనే విషయాన్ని అధికారులు ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే,జిల్లా స్థాయి అధికారులు పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నానని తెలిపారు. ఎంతసేపు కాపు వర్గీయుల లోన్లు కోసమే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారందరికీ కార్పొరేషన్ లోన్లు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ఎమ్మెల్యేలు చొరవ చూపాలని కోరుతున్నానని అన్నారు. ఎస్సీ ఎస్టీ నిధులను సంక్షేమ పథకాలకు ఉపయోగించడం సరికాదని ఎస్సీ ఎస్టీ వారికి మాత్రమే చెందే విధంగా తగిన కార్యాచరణ రూపొందించాలని అన్నారు. రాబోయే రోజుల్లో సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.