జగనన్న ప్రభుత్వంలో కాపులకు అగ్రపీఠం…

జగనన్న ప్రభుత్వంలో కాపులకు అగ్రపీఠం…

జనసేనది రాజకీయ పార్టీ కాదు… సెలబ్రిటీ పార్టీ…

కాపు కుటుంబ సభ్యుల సంక్షేమం కోసమే కాపు నేస్తం పథకం..

గత ప్రభుత్వాలు కేవలం కాపులను ఓటు బ్యాంకుగానే పరిగణించేవారు..

కాపులను వేధించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం…

కాపులకు అండగా ఉన్నది జగనన్న ప్రభుత్వం…

కాపుల అభివృద్ధే ప్రధాన ఆజెండాగా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు..

గడిచిన మూడున్నర ఏళ్లలో కాపుల సంక్షేమం కోసం 26 వేల కోట్లతో వివిధ సంక్షేమ పథకాలు..

రాష్ట్ర వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఎమ్మెల్సీ లతో విస్తృత స్థాయి సమావేశం…

జగనన్న ప్రభుత్వంలో కాపులకు పెద్దపీఠం వేసి వారిని అన్ని విధాలుగా ఆదుకోవడం జరిగిందని రాష్ట్ర మంత్రివర్యులు కొట్టు సత్య నారాయణ,అంబటి రాంబాబు, బొత్స సత్య నారాయణ,గుడివాడ అమర్నాథ్,దాడిశెట్టి రాజా తదితరులు పేర్కొన్నారు.

సోమవారం రాజమహేంద్రవరం మంజీరా కన్వెన్షన్ హాల్ నందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఎమ్మెల్సీలు తదితరులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి కాపు సామాజిక వర్గానికి మరింత అభివృద్ధికి చేపట్టవలసిన కార్యచరణపై చర్చించారు

ఈ సందర్భంగా బొత్స సత్య నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కేవలం కాపులను ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణించడం జరిగిందని ప్రియతమముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కాపులకు సమూచిత స్థానం కల్పిస్తూ వారి అభివృద్ధికి పెద్ద పీఠం వేయడం జరిగిందన్నారు.

అన్ని సామాజిక వర్గాలతో పాటు కాపు సామాజిక వర్గాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందే విషయంలో చేయూత అందించాలనే తపనతో కాపు నేస్తం పథకాన్ని రూపొందించి అమలు చేయడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా దాదాపు వేల కోట్ల రూపాయలు కాపు సామాజిక మహిళలకు అందజేస్తున్నామన్నారు.

జనసేన పార్టీ రాజకీయ పార్టీ కాదని అది ఒక సెలబ్రిటీ పార్టీ అని,ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీరు సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యవహరిస్తురాన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను జనసేన పార్టీ అధినేత విమర్శించడం పట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

కాపు సామాజిక వర్గం ఇంకా అభివృద్ధి చెందడానికి ఏఏ కార్యక్రమాలు అమలుచేస్తే బావుంటుందో అనే విషయాల పైన ఈ సమావేశం నిర్వహించడం జరిగిందని అనేక విషయాలను చర్చించడం జరిగిందని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామన్నారు.

కాపు సామాజిక వర్గం ఆర్థికంగా, విద్య పరంగా,వైద్య పరంగా ఏ రకంగా అభివృద్ధి చెందాలి అన్న విషయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకునమ్మన్నారు.

రానున్న రోజుల్లో మరొకసారి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి కాపు సామాజిక వర్గ అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై మరోసారి చర్చిస్తామన్నారు

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలన్నీ ఇది నెరవేర్చడం జరుగుతుంద న్నారు.గత టిడిపి ప్రభుత్వం సంవత్సరానికి కాపు సామాజిక అభివృద్ధి కోసం సంవత్సరానికి 1000 కోట్లు చొప్పున ఐదు సంవత్సరాల కాలంలో 5 వేల కోట్లు ఖర్చు చేస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగిందని కేవలం ఐదు సంవత్సరాల కాలంలో 1824 కోట్ల 64 లక్షల రూపాయలను రెండు లక్షల 54 వేల లబ్ధిదారులకు తెలుగుదేశం పార్టీ అందజేయడం జరిగిందన్నారు.ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు.

జగన్మోహన్ రెడ్డి కాపుల అభివృద్ధి కోసం సంవత్సరానికి 2000 కోట్ల రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాల కాలంలో 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని నేడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన మూడు సంవత్సరాల కాలంలోనే కాపుల అభివృద్ధి కోసం 26,490 కోట్ల రూపాయలను 70 లక్షల 83 వేల మంది లబ్ధిదారులకు వివిధ పథకాల రూపంలో అందచేయడం జరిగిందన్నారు.

గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమ ద్వారా నేడు ప్రజల దగ్గరికి వెళ్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే అందుకు కారణమన్నారు..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో కుమార్కై కాపు సామాజిక వర్గ నాయకులను కించపరిచే విధంగా మాట్లాడడం ఒక సిగ్గుమాలిన చర్యగా ఆయన అభివర్ణించారు.

2019 సంవత్సరం ఎన్నికల్లో పెద్ద ఎత్తున కాపు సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వడం వలన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాలలో 151 నియోజక స్థానాలను కైవసం చేసుకోవడం జరిగిందన్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఒక ఉన్మాది కంటే దారుణంగా ఉందని విచక్షణ కోల్పోయి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కాపులను అణచివేసే విధంగా పాలన సాగిందన్నారు.

చంద్రబాబు నాయుడు హయాంలో అనేక కాపు వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని,కాపు వ్యతిరేకిగా చంద్రబాబునాయుడు కు ముద్ర పడిందన్నారు.

దివంగత నేత వంగవీటి మోహన రంగా హత్య వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ అవలంబించిన తీరు, కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని మోసగించిన తీరు, ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తే ఉద్యమం అణిచివేతకు చంద్రబాబు నాయుడు అనుసరించిన విధానం కాపు జాతికి చంద్రబాబు నాయుడు ఎంత వ్యతిరేకమో మనకు అర్థమవుతుందన్నారు.

ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపులకు అగ్ర పీఠం వేయడం జరిగిందని ఆ విషయం తెలియజేయాలని ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

జగన్మోహన్ రెడ్డి హయాంలో 26 మంది శాసనసభ్యులు, ముగ్గురు పార్లమెంటు సభ్యులు,5 గురు శాసన మండల సభ్యులు కాపు జాతి సంబంధించిన వారే ఉన్నారని ఈ గణాంకాలు చూస్తే కాపు జాతికి ఎంత ప్రాధాన్యత కల్పిస్తున్నారో మనకు అర్థమవుతుందన్నారు.

అందరూ బాగుండాలి అందులో కాపులు కూడా ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాపు సంక్షేమం కోసం 26 వేల కోట్లు రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధోరణి,మాట్లాడిన తీరు శాసన సభ్యులను దూషించిన విధానాన్ని కాపు సమావేశం ముక్తకంఠంతో తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

ముద్రగడ పద్మనాభం ఉద్యమం సమయంలో అనేకమంది మీద కేసులు పెట్టడం జరిగిందని వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆ కేసుల నుండి విముక్తి కల్పించడం జరిగిందన్నారు.

కాపులను వేధించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని, కాపులకు అండగా ఉన్న ప్రభుత్వం వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మన్నారు.

కాపు సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు తీవ్ర అన్యాయం చేశారని, ఆయనను ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నా రన్నారు. కాపు జాతికి సంబంధించిన ప్రజలు అందరూ ఈ విషయాన్ని గమనిస్తున్నారని ఆయన తెలియజేశారు.

ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ కాపు జాతి అభివృద్ధి కోసం ఇంకా ఏ పథకాలు అమలు చేస్తే బాగుంటుందో తదితర విషయాలను ఈ సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు.

రెండు లక్షల పుస్తకాలు చదివిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ మంత్రివర్యులు హరిరామ జోగయ్య గారు రాసిన పుస్తకాన్ని చదివితే వాస్తవాలు తెలుస్తాయన్నారు.

దివంగత నేత వంగవీటి మోహన రంగా గారిని నిస్సహాయతను చేసి ఏ విధంగా కిరాతకంగా చంపారో ఆ చరిత్రను కూడా పవన్ కళ్యాణ్ తెలుసుకుంటే బాగుంటుందని ఆయన హిత బోధ చేశారు

ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి మరింత మేలు చేసే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పని చేస్తున్నారని కాపు జాతి అభ్యున్నతి కోసం మూడున్నర సంవత్సరాల కాలంలో ఆయన అవలంబించిన విధానమే జగన్మోహన్ రెడ్డి పాలనకు నిదర్శనమాన్నారు

చంద్రబాబు నాయుడుకి వత్తాసు పలికే పద్ధతిలో భాగంగా కాపు సామాజిక వర్గాన్ని పూర్తిగా మభ్య బెట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానాల్లో కూర్చోబెట్టాలనా,జనసేన పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని ఆయన తప్పు పట్టారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!