వాల్మీకుల ఎస్టీ పునరుద్దరణపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపిన వాల్మీకులు
స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్ 30, నంద్యాల:
వాల్మీకుల ఎస్టీ పునరుద్దరణపై ఏకసభ్య కమిషన్ వేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ నుండి శ్రీనివాస సెంటర్ వరకు 500 మంది వాల్మీకులు పాదయాత్ర చేశారు.ఈ సందర్బంగా వాల్మీకి రిజర్వేషన్ పోరాటసమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయ పులికొండన్న,జిల్లా అధ్యక్షులు నారి,ప్రధానకార్యదర్శి మదుగోపాల్,మాజీ జిల్లా జెడ్పిటిసి ప్లోర్ లీడర్ లాలుస్వామి, కార్పోరేషన్ డైరెక్టర్ మురళి,పార్లమెంట్ లీగల్ అడ్వైసర్ బోయ సుబ్బారాయుడు, మహిళా నేత భారతి,పెద్దక్క, విద్యార్థి నేత శివనాగేంద్ర, మహానంది మండల నేత జయరాం,పరమటూరి శేఖర్ పట్టణ అధ్యక్షులు పరమేష్,ఉద్యోగ నేత రమేష్ నాయుడు,ఆళ్లగడ్డ వెంకటేశ్వర్లు, తదితరులు మాట్లాడుతూ వాల్మీకుల స్థితి గతులపై కమిషన్ rtd IAS అధికారిశ్యామ్యూల్ ఆనంద్ నియమించి 3 నెలల కాల వ్యవదిని ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదములు తెలిపారు. ఎస్టీ పునరుద్ధరణ వాల్మీకుల జన్మహక్కు అని,66 సంవత్సరాలుగా పేదరికంలో మగ్గుతున్నామని, మేము ఎక్కడ అభివృద్ధికి నోచుకోలేదని,మేము కొత్తగా ఎస్టీ కోరడం లేదని పునరుద్దరనే కోరుతున్నప్పుడు కొంతమంది సోదరులు కులం పేరు పెట్టి వాల్మీకులను నిందించడం భావ్యం కాదని,మా రిజర్వేషన్ ను అడ్డుకోవద్దని,రిజర్వేషన్ శాతాన్ని పెంచేందుకు మేము కూడా మీతో పోరాటం చేస్తామని , మీ కులం పేరు మేము ఎక్కడ ప్రస్తావించలేదని,మా కులం పేరు పెట్టి పదే పదే నిందించడం వల్ల మా మనోభావాలు దెబ్బతింటాయని కనుక సోదర భావంతో మెలిగేందుకు కృషి చేయాలని వాల్మీకులను నిందించే నేతలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీశైల నియోజకవర్గ నేతవెంకటేశ్వర్లు,బి.కోడూరు సర్పంచ్ నాగేంద్ర నేతలు,హరి,A1 నాగరాజు, నాగేశ్వరరావు, ఎల్లస్వామి,నాయుడు,హరి,రవి,సూరి,సవారీ,రమేష్,మధు,బుజ్జి,వినోద్,కేశాలు,బైరేశ్, సురేంద్ర, సుబ్బయ్య, నాగన్న, సుధాకర్, మనోహర్,సుబ్బయ్య కోయిల్కుంట్ల తదితరులు పాల్గొన్నారు.