విధి నిర్వహణలో మరణించిన వారి భార్యలకు పింఛను మంజూరు
స్టూడియో 10 టీవీ న్యూస్ అక్టోబర్ 29, మహానంది:
మహానంది దేవస్థానంలో విధులు నిర్వహిస్తూ మరణించిన ఉద్యోగులు మరియు పదవి విరమణ చేసి మరణించిన ఉద్యోగుల వారి భార్యలకు పదిమందికి దేవస్థానం ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసి ఉత్తర్వులు జారీచేశారు.ఈ ఉత్తర్వులను దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి,ఏఈవో ఎర్రమల మధు,పర్యవేక్షకులు ఓంకారం వేంకటే శ్వరుడు పాల్గొన్నారు.