శ్రీనివాసరావుకు ఎన్ హెచ్ ఆర్ సి దృవీకరణ
మానవ హక్కుల ప్రతిఙ్ఞ
పత్రం జారీ చేసిన ఎన్ హెచ్ ఆర్ సి
సెక్రెటరీ జనరల్
జగిత్యాల: జగిత్యాల జిల్లా వాసి అయిన హక్కుల నేత, జాతీయ మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ అయిల్నేని శ్రీనివాసరావు కు భారతదేశ జాతీయ మానవ హక్కుల కమీషన్ అధికారికంగా మానవ హక్కుల ప్రతిజ్ఞ ధ్రువీకరణ పత్రం జారీ చేసింది. ఎన్ హెచ్ ఆర్ సి సెక్రెటరీ జనరల్ దేవేంద్ర కుమార్ సింగ్ గురువారం ఇట్టి దృవీకరణ పత్రాన్ని జారీ చేశారు. శుక్రవారం జాతీయ మానవ హక్కుల మండలి జాతీయ అధ్యక్షులు డాక్టర్ పి. సంపత్ కుమార్ వాఁట్సాప్ ఫోన్ ద్వారా అయిల్నేని శ్రీనివాస రావుకు ఇట్టి సందేశాన్ని చేరవేసి అభినందించారు. ఎలాంటి వివక్ష లేకుండా అందరి మానవహక్కులను పరిరక్షించాలని, హక్కుల సాధనను ప్రోత్సహించాలని అందులో సూచించారు. ఇతరుల మానవ హక్కులకు భంగం కలుగకుండా స్వేచ్ఛగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను ప్రోత్సహించాలని అందులో పేర్కొన్నట్లు సంపత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడుతూ.. తనకు ఇంత గొప్ప గుర్తింపును ఇచ్చిన ఎన్ హెచ్ ఆర్సీ కి, జాతీయ మానవహక్కుల మండలికి, జాతీయ అధ్యక్షులు డాక్టర్ పి. సంపత్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై ఎంతో విశ్వాసంతో అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కుల సాధనకై కృషి చేస్తానని అన్నారు. రాష్ట్రంలో హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా బాధితుల పక్షాన అండగా నిలిచి న్యాయపోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. తనతోపాటు హక్కుల సాధనకు కృషి చేస్తూ తనకు చేదోడు – వాదోడుగా నిలుస్తున్న రాష్ట్ర కమిటీ కి, వివిధ జిల్లాల కార్యవర్గాలకు అందరికీ ఈ గుర్తింపు అంకితం అవుతోందని అన్నారు. అందరి కృషి వల్లనే అనతికాలంలో గొప్ప గుర్తింపు ను సాధించామని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరిపై ఉందన్నారు.
శ్రీనివాసరావు కు అభినందనలు
జాతీయ మానవహక్కుల కమీషన్ గుర్తింపుతో మానవహక్కుల ప్రతిజ్ఞ ధ్రువీకరణ పత్రం పొందిన ఆయిల్నేని శ్రీనివాసరావు ను సామాజిక కార్యకర్త, హక్కుల నేత, తెలంగాణ జనసమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు, హక్కుల కార్యకర్తలు, నేతలు మొగుళ్ల భద్రయ్య, నక్క గంగారాం, బాస మహేష్, మ్యాడం జలందర్, అప్పం చిన్నారెడ్డి, ప్రభాకర్, భీమేష్, బొజ్జ ప్రకాష్, యం.శివకృష్ణ, గుగులోతు బాలాజీ, నాగరాజు, నక్క చంద్రమౌళి తదితరులు అభినందించారు. శ్రీనివాసరావు సేవలను, పోరాటపటిమను గుర్తించిన జాతీయ మానవ హక్కుల కమీషన్ ను, మానవ హక్కుల మండలికి వారు ధన్యవాదాలు తెలిపారు.