తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం సీతానగరం మండల కేంద్రం ఎంపీడీవో ఆఫీసు నందు విలేకరుల సమావేశంలో ఎంపీపీ గుర్రాల జోత్స్న తెలియజేస్తూ వినికిడిలో లేని తమ పార్టీ అభివృద్ధి కోసం కులాల మధ్య చిచ్చు పెడుతూ చిన్నపాటి సంఘటనలను అమాయకులైన దళితులకు భూతద్దంలో చూపిస్తూ ఇటీవల కాలంలో కూనవరంలో జరిగిన జనసేన పార్టీకి దళితులకు మధ్య జరిగిన గొడవను వైసీపీ పార్టీపై రుద్దడం లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును వాడుకుంటూ రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. మండలంలో ఉన్న దళితులందరికీ మేము అండగా ఉన్నామని తెలిపారు. కొత్తగా మీరు వేరే చోట నుంచి వచ్చి ఇక్కడ చేసేది ఏముందన్నారు. ఇప్పటివరకు దళితుల అభివృద్ధి కొరకు పాటుపడిన స్థానిక ఎమ్మెల్యే పై బురద జల్లడం సరియైన ధోరణి కాదన్నారు. ఇటీవల కాలంలో మిర్తిపాడు గ్రామంలో జరిగిన సంఘటను కూడా రాజకీయం చేశారని దుయ్యబట్టారు. ఇలా ప్రతీ గ్రామంలో గొడవలు పెట్టుకుంటూ పోతే గ్రామాల మధ్య సఖ్యత ఎక్కడ ఉంటుందని అన్నారు. కూనవరం గ్రామం సంఘటనలో హాస్పటల్ నందు వైద్య సేవలు పొందుతున్న వారిని కలవడం జరిగిందనీ వారికి తగిన న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఎంపీపీ అన్నారు. సొంత లాభాల కోసం తమ పార్టీ పేరును వాడుకుంటూ దళితుల మధ్య చిచ్చుపెట్టే వారిని నమ్మవద్దని మండల దళిత ప్రజలకు నాయకులకు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే మండల వైకాపా నాయకుడు గెద్దాడ త్రిమూర్తులు మాట్లాడుతూ దీపావళి రోజున జరిగిన సంఘటనను కావాలనే రాజమండ్రి నుండి వచ్చిన కొందరు ఉద్దేశపూర్వకంగానే దళిత నాయకులమంటూ అన్నదమ్ములుగా మెలిగే గ్రామాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. కూనవరం గ్రామంలో జరిగిన సంఘటనకు ఎమ్మెల్యేకు ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ జక్కంపూడి కుటుంబంపై కావాలని బురద జల్లడానికి మండల దళిత ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిని నమ్మవద్దని మండల దళిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మండలంలో దళితులకు మంచి మంచి పదవులు ఇచ్చి పెద్దపీట వేసిన ఘనత స్థానిక ఎమ్మెల్యేకే దక్కిందని అన్నారు. అందువల్లనే దళితులకు కావలసిన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి మేము కృషి చేస్తున్నామన్నారు. ఇప్పుడు ఎవరో వచ్చి మనలో మనకి విద్వేషాలు రెచ్చగొట్టే విధానాన్ని ప్రజలు గమనించాలన్నారు. గ్రామం అన్న తర్వాత ఒకరి అవసరం ఒకరికి ఉంటుందని తాత్కాలికంగా మాటలు చెప్పే నాయకులను నమ్ముకుంటే దళితుల అభివృద్ధి కుంటుపడుతుందని తెలియజేశారు. అలాంటి వారిని నమ్ముకుంటే చివరకు వారు బాగుపడతారే తప్ప అన్యాయం జరిగిన వారికి ఎటువంటి ప్రయోజనం ఉండదని తెలియజేశారు. మండల ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేరుగా మాకు తెలియజేయవచ్చునని అన్నారు. మేము మీకు తగిన న్యాయం చేయకపోతే వేరే వారిని ఆశ్రయించాలే తప్ప అబద్ధాలు చెప్పే వారిని నమ్మకూడదని తెలియజేశారు. దళితుల అభివృద్ధి కోసం పథకాలను ప్రవేశపెట్టి పని చేసే జగన్మోహన్ రెడ్డిని మనం కాదనుకుంటే దళితుల అభివృద్ధి పూర్తి స్థాయిలో కుంటుపడుతుందనే విషయాన్ని మండల ప్రజలంతా గమనించాలన్నారు. ఎక్కడనుంచో వచ్చి నాలుగు మాటలు చెప్పి పబ్బం గడుపుకునే వారిని నమ్మితే మనకు గ్రామంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు తీరవన్నారు. కులాల మధ్య విభేదాలు లేకుండా గతంలో అన్నదమ్ముల మాదిరిగా అందరూ కలిసి ఉంటేనే మన జీవితం ప్రశాంతంగా ఉంటుందని తెలియజేశారు. ఈ నేపథ్యంలోని ఎంపీటీసీ తాడిపల్లి వెంకట్రావు మాట్లాడుతూ తమ పార్టీ అభివృద్ధి కోసం కొందరు కావాలనే రాజమండ్రి నుండి ఇక్కడికి వచ్చి దళితుల మధ్య చిచ్చులు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఎటువంటి విభేదాలు లేకుండా అన్నదమ్ముల్లా కలిసి ఉండే గ్రామాల మధ్య గొడవలు రేపుతున్నారని మండిపడ్డారు. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును వాడుకుంటూ వారు లబ్ధి పొందాలని చూస్తున్నారనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. ఇప్పటికైనా ఇలాంటి రెచ్చగొట్టే ధోరణి మానుకోకపోతే మండలంలో ఉండే వైకాపా దళిత ప్రజలంతా ఏకమై మిమ్మల్ని అడ్డుకోవడానికి మేము వెనకాడబోమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైకాపా దళిత సీనియర్ నాయకులు మనెల్లి వెంకట్రావు,బచ్చల రాజశేఖర్,చిడిపి బంగారయ్య తదితరులు పాల్గొన్నారు.