తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం సీతానగరం
శనివారం పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సీతానగరం ఎస్ఐ శుభ శేఖర్ ఆధ్వర్యంలో వేదాస్ ఆసుపత్రిచే మెగా వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నార్త్ జోన్ డిఎస్పీ కడలి వెంకటేశ్వరరావు అతిథిగా హాజరై వైద్య శిబిరం ప్రారంభించారు. అనంతరం డిఎస్పీ కడలి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణకై, సమాజ భద్రత కోసం విధి నిర్వహణలో నేడు మీరు చూపిన ప్రాణత్యాగం మా భవిష్యత్తుకు బంగారు బాటలుగా నిలుస్తాయని అమర వీరులను జ్ఞాపకం చేసుకుంటూ నివాళులు అర్పించారు. అమరుల జ్ఞాపకార్థం నేడు రేపు రోగులకు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని సీతానగరం ఎస్ఐ శుభ శేఖర్ తెలిపారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులు చూపిన తెగువ ఎన్నటికీ మరువలేనిదని కోరుకొండ సిఐ ఉమామహేశ్వరరావు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీతానగరం పోలీస్ సిబ్బంది, వేదాస్ ఆసుపత్రి యాజమాన్యం మద్దుకూరి లక్ష్మీ, జడ్పీటిసి చల్లమళ్ళ వెంకటలక్ష్మి సుజీరాజు, ఎంపీపీ గుర్రాల జ్యోస్నా, రాష్ట్ర దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ పెదపాటి రమేష్ బాబు, సీతానగరం వైసీపీ కన్వీనర్ ఘంటా శ్రీనివాసరావు, మండల వైసీపీ సేవాదళ్ నాయకులు చల్లమళ్ళ సుజీరాజు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.