కనీవిని ఎరుగని రీతిలో అదరగొట్టాలి
రాహుల్ పర్యటనపై వీర్లపల్లి శంకర్ తో మాణిక్యం ఠాగూర్
గాంధీభవన్ లో రాహుల్ షాద్ నగర్ పర్యటనపై భేటీ
బైపాస్ వై జంక్షన్ వద్ద రిసీవింగ్ కార్నర్ సమావేశానికి ఏర్పాట్లు
కాంగ్రెస్ పార్టీ అధినేత, యువ నాయకుడు రాహుల్ గాంధీ పాదయాత్ర నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో పాదయాత్ర ఏర్పాట్లు కనివిని ఎరుగని రీతిలో ఉండబోతున్నాయని షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్ దీమా వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ గాంధీ భవన్ లో వీర్లపల్లి రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ ఏఐసిసి నాయకుడు మాణిక్యం ఠాగూర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షాద్ నగర్ నియోజకవర్గంలో ఈ నెల 29న రాహుల్ గాంధీ పర్యటన మొదలవుతుందని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రకు సంబంధించి నియోజకవర్గం నుండి మరియు ఆయా గ్రామాల నుండి కార్యకర్తల సమీకరణ, అనుసరించవలసిన విధి విధానాలను ఇంకా ఇతర అంశాలతో పాటు ఆయా సూచన సలహాలను ఈ భేటీలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ కు మాణిక్యం ఠాగూర్ దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గంలో అనుసరించాల్సిన ప్రచార విధివిధానాలను ఆయనకు షెడ్యూల్ అందజేశారు. రాహుల్ గాంధీని వై జంక్షన్ వద్ద ఆహ్వానించడంతోపాటు దాదాపు 25 వేల మందికి పైగా రోడ్ షో మీటింగ్ ఉండబోతుందని పేర్కొన్నారు. అడుగడుగున కార్యకర్తలు కనివిని ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున పాదయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గురువారం ఉదయం వీర్లపల్లి శంకర్ అన్నారం వై జంక్షన్ వద్ద రిసీవింగ్ కార్నర్ మీటింగ్ స్థలాన్ని పర్యవేక్షించారు. స్థానిక నాయకులతో కలిసి ఆయన ఏర్పాట్లపై స్వయంగా సమీక్షించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా చేసేందుకు ఆయా గ్రామాల నుండి కార్యకర్తలు కదం తోక్కబోతున్నారని, కాంగ్రెస్ పూర్వవైభవంతో ఈ రోడ్ షో ద్వారా తన సత్తా చాటబోతుందని, నియోజకవర్గం ఎల్లప్పటికీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ప్రూవ్ చేయబోతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.