జగనన్న కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు
వీడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్ 29,మహానంది:
మహానంది మండలం మేజర్ గ్రామపంచాయతీ గాజులపల్లి గ్రామ పరిధిలోని స్థానిక జగనన్న కాలనీ లో మౌలిక వసతుల కల్పనకు ముమ్మరంగా పనులు నిర్వహిస్తున్నామని వైసిపి నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఐదు లక్షల యాభై వేల రూపాయల ప్రభుత్వ నిధులతో విద్యుత్ స్తంభాలను జెసిబి సహాయంతో పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా జగనన్న కాలనీల్లో విద్యుత్ సరఫరాకు సంబదిత పనులు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. లబ్ధిదారులకు త్వరలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు.