ఏజెన్సీ సిబ్బందికి పెరిగిన జీతం

ఏజెన్సీ సిబ్బందికి పెరిగిన జీతం

స్టూడియో 10టీవీ న్యూస్, అక్టోబర్ 19, మహానంది:

మహానంది దేవస్థానంలో పనిచేసే ఏజెన్సీ సిబ్బందికి కేవలం నేలకు 420 రూపాయలు మాత్రమే.రోజుకు 14 రూపాయల చొప్పున ఏజెన్సీ సిబ్బందికి జీతం పెంచుతూ దేవాదాయ శాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. గత సెప్టెంబర్ పదవ తేదీ నుండి పెరిగిన ఈ జీతాలు వర్తిస్తాయని భోగట్టా సాధారణంగా ప్రతిరోజు విధులకు హాజరైతే 334 రూపాయలు వస్తాయని నెల మొత్తం పని చేస్తే పదివేల 20 రూపాయలు జీతం వస్తున్నట్లు ఏజెన్సీ సిబ్బంది తెలిపారు.నిత్యవసర వస్తువులు అన్ని పెరిగినా తనకు కేవలం 14 రూపాయలు మాత్రమే పెంచటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.పెరిగిన జీతంతో కలుపుకొని దాదాపు పది వేల ఐదు వందల రూపాయలు అవుతుందని అందులో పిఎఫ్ వేయి రూపాయలు ఇన్సూరెన్స్ 300 రూపాయలు కట్ చేస్తారని మాకు మిగిలేది ఏమిటి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని లేబర్ యాక్ట్ ప్రకారం డైలీ వేజెస్ సిబ్బందికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న మని ఏజెన్సీ సిబ్బంది పేర్కొంటున్నారు. దీనిపై ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి నీ వివరణ కోరగా తాము మూడు నుంచి నాలుగు వేల రూపాయలు ఏజెన్సీ సిబ్బందికి జీతాలు పెంచాలని దేవాలయ శాఖ అధికారులకు తెలియజేశామని మిగతా ఆలయాల్లో ఏ విధంగా ఇస్తున్నారో అదేవిధంగా మహానంది దేవస్థానంలో పని చేసే ఏజెన్సీ సిబ్బందికి రోజుకు 14 రూపాయలు జీతం పెంచుతూ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.గత సెప్టెంబర్ 10 నుంచి పెరిగిన జీతాలు వర్తిస్తాయని ఈవో తెలిపారు .

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!