కార్పోరేటు ప్రైవేటు దీటుగా ప్రభుత్వ పాఠశాలు
స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్ 19,మహానంది:
కార్పోరేటు, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్మించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని మాజీ సర్పంచ్, గోపవరం సొసైటీ బ్యాంకు ప్రెసిడెంట్, డీసీఎంసీ డైరెక్టర్ వడుగూరి రామకృష్ణుడు (కిట్టు) అన్నారు. బుధవారం మహానంది మండలం మేజర్ గ్రామపంచాయతీ గాజులపల్లి గ్రామ పరిధిలోని బసాపురం మండల పరిషత్ పాఠశాలలో “నాడు నేడు” పథకం నిర్మాణనుల కింద అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి విద్య, వైద్యం, సంక్షేమం అత్యంత ప్రధానమైన అంశాలు అని అన్నారు. రూ. 12 లక్షల రూపాయలతో నాడు – నేడు పనులకు శంకుస్థాపన చేశామన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు వేస్తున్నారన్నారు. పేదవాడి చదువు కోసం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ద పెట్టారని అన్నారు. కార్పోరేట్ స్కూల్స్ దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. గతంలో పాఠశాలల అభివృద్ధి లేక విద్యార్థుల డ్రాపవుట్స్ శాతం అధికంగా ఉండేవన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చాక కార్పోరేట్ బడులకు తీసుకోకుండా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ ఫుల్ బోర్డు పెట్టాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ తక్ధీర్,వైస్ చైర్మన్ కే.లావణ్య,హెడ్మాస్టర్ శ్రీనివాసులు, వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లికార్జున,మాజీ జెడ్పిటిసి పాఠశాల చైర్మన్ ఆనంద్, 14వ వార్డు సభ్యులు సుబ్రహ్మణ్యం,షేక్ ముజీబ్,మునయ్య, తదితరులు పాల్గొన్నారు.