గోపి రాథోడ్
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం సేవాలాల్ సేన రాష్ట్ర ఇన్చార్జి గోపి రాథోడ్ మాట్లాడుతూ ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానికి గిరిజన రిజర్వేషన్ ఉద్యమంలో సేవాలాల్ సేన జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు సభావత్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ఎన్నో రకాల ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఆభివందనలు తెలియజేశారు ఈ పోరాట విజయంతో పొంగిపోకుండా గిరిజన సంఘాల నాయకులందరూ ఏకతాటిపై వచ్చి మరెన్నో ఉద్యమాలతో గిరిజన సమస్యల పరిష్కారం కొరకు ఉద్యమించి మరిన్ని విజయాలు సాధించాలని గోపి రాథోడ్ అన్నారు గత 8సంవత్సరాల పాటు గిరిజనులు సాగించిన పోరాటాల ఫలితంగానే రిజర్వేషన్ తెలంగాణలో గిరిజనులకు రిజర్వేషన్ 6 నుండి 10 శాతానికి అమలు అయిందని అన్నారు కెసిఆర్ ఇచ్చిన వాగ్దానం ప్రకారం జీవో జారీ చేయడంతో పాటు తక్షణం అమలు చేస్తున్నట్లు ప్రకటించడాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు హర్ష హరినాయక్ సందీప్ సన్నీ కృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు