స్టూడియో 10టీవీ ప్రతినిధి కృష్ణపల్లిసురేష్:- దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేయడంలో కేంద్ర బిజెపి మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు చాపిడి పురుషోత్తం అన్నారు. ఈ సందర్భంగా రెబ్బెన మండల తాసిల్దార్ కి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. కేంద్రంలో మోడీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తానని ఉపాధి ఉద్యోగం కల్పిస్తానని గద్దెనెక్కిన బిజెపి ప్రభుత్వం ఉద్యోగుల మాట ఊసే లేకుండా పోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ భారత ప్రజాతంత్ర యువజన సమైక్య జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు ఆత్మకూరి సతీష్ రెబ్బెన మండల ఉపాధ్యక్షుడు చల్లూరి వంశీ నాయకులు హరీష్ పాండు పాల్గొన్నారు.