మోహన్ హత్య కేసులో సూత్రధారులు ఎవరో తేల్చండి!

మోహన్ హత్య కేసులో  సమగ్ర విచారణ జరిపి అసలు సూత్రధారులు ఎవరో తేల్చండి!  సిపిఎం డిమాండ్!!

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం  మైసూర్ వారి పల్లి  పంచాయతీ, శాంతినగర్ అంగన్వాడీ టీచర్  ధనమ్మ భర్త, మాజీ సర్పంచి దివిటి మోహన్ నీ శనివారం మధ్యాహ్నం పట్టపగలు దారుణంగా హత్య చేసిన విషయం విధితమే. సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు సి హెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, హత్య చేసిన  అంతకుడు ఓ ప్రైవేటు హాస్పిటల్లో, తనకు తగిలిన వేల గాయాలకు వైద్యం చేయించుకొని పోలీసుల ముందు  లొంగి పోయినట్లు సమాచారం. సీసీ పుటేజ్ ఆలు ఆధారాలు సేకరించాలని,  ఈహత్యపై సమగ్ర విచారణ అన్ని కోణాల్లో జరపాలని, హత్య చేయించిన వారు ఎవరు, ఇంకా ఎంతమంది దీంట్లో పాల్గొన్నారు. దోషులెవరు తేల్చాలని డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్,  కబ్జాదారులు, ఎర్రచందనం,  డ్రగ్స్, గంజాయి, వైసిపి వర్గ పోరాటాల, ఇలాంటి అనుమానాలు కూడా ప్రజల్లో ఉన్నాయని, తెలిపారు.  హత్యకు గురైన మోహన్ ఆ పంచాయతీలో  ప్రజల సమస్యలపై నిత్యం స్పందించే వారిని, అన్యాయాలపై  నిలదీసే వారిని, పెద్దమనిషి తరహాలో  పంచాయతీలు చేసేవారని, తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, దౌర్జన్యాలు, హత్యలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత 20 సంవత్సరాలుగా కోడూరు ప్రశాంతంగా ఉందని, ఇటువంటివి జరగడం  ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందని  ఆందోళన వ్యక్తం చేశారు.  హత్యలో  పాల్గొన్న వాడు  వారం రోజుల క్రితం కోవేట్ నుండి వచ్చారని తెలిసింది. ఒక్కడే ఇంత  దుర్మార్గానికి పాల్పడే అవకాశం లేదన్నారు. ఈ ఏడాదిలోనే ఓబులవారిపల్లె మండలం, సిపిఎం నాయకులు జయరామ్ భూ కబ్జాలపై ప్రశ్నిస్తున్నారని, పోలీస్స్టేషన్ ఎదుట,అధికార పార్టీ వారే దాడి చేసి తప్పుడు కేసు పెట్టారు అనే విషయం గుర్తు చేశారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చిట్వేల్ లో సిపిఐ కార్యకర్త చుక్కా రామయ్య,  తన భార్యతో కలిసి  ద్విచక్ర వాహనం పై  ప్రయాణిస్తుండగా, పట్టపగలు సిద్ధారెడ్డి పల్లి రోడ్డుపైన, కిరాయి మనుషులు తో అతి దారుణంగా చంపిన విషయం గుర్తు చేశారు, అదేవిధంగా ఈ మధ్యకాలంలో కోడూరు రైల్వే స్టేషను దగ్గర,  ఓ మహిళను అత్యాచారం  చేసి దారుణంగా చంపిన విషయం గుర్తు చేశారు. అదేవిధంగా కోడూరు నరసరావుపేటలో నలభై సంవత్సరాలుగా  దిలీప్  ఆచారి,  నివాసం ఉంటున్న ఇంటిని తెల్లవారుజామున, రియల్ ఎస్టేట్  రౌడీలు కూల్చివేసిన విషయం గుర్తు చేశారు. ఇంతవరకు కనీసం కేసు నమోదు కాలేదు. ఇటువంటి దారుణాల పట్ల పోలీసుల మెతకవైఖరి పట్ల సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది తెలిపారు.   దోసులుఎంతటివారైనా, ఏ పార్టీ వారైనా, తక్షణం అరెస్టు చేయాలని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!