రాతరగిల్చిన ఔదార్యం..!
పసికందు ప్రాణం నిలిపింది
పసికందు ప్రాణం నిలిపింది
“హలో షాద్ నగర్” సభ్యులకు పలువురు ప్రశంసలు
మహేష్ దీప్తి దంపతులకు దాతల సహకారంతో రూ. 1,50,000 సహకారం
మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజన్, ప్రముఖ సామాజికవేత్త వంగూరి గంగిరెడ్డి, కార్మిక నేత పినపాక ప్రభాకర్, ఎంపిటిసి భార్గవ్ కుమార్ రెడ్డి తదితరులు
ఒక అక్షరం చిన్నారి జీవితాన్ని నిలబెట్టింది.. రాత రగిల్చిన ఔదార్యం పసికందు ప్రాణం నిలిపింది. సామాజిక సేవల్లో తమకంటూ ఒక ముద్ర వేసుకుంటున్న హలో షాద్ నగర్ సభ్యులు అందరూ ఎంతైనా ప్రశంసనీయమని షాద్ నగర్ పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎం.ఎస్ నటరాజన్, ప్రముఖ సామాజికవేత్త వంగూరి గంగిరెడ్డి, ఎంపిటిసి భార్గవ్ కుమార్ రెడ్డి, కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్ , రైతు కాలనీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి శుక్ర వర్ధన్ రెడ్డి, న్యాయవాది గంధం సురేందర్ తదితరులు అన్నారు. ఆదివారం మహేష్ దీప్తి దంపతులకు మొత్తం 1లక్షా 50 వేల ఆర్థిక సహాయం వారి చేతికి పలువురి చేతుల మీదుగా అందజేశారు. స్థానిక కోట మైసమ్మ దేవాలయం ఆవరణలో చిన్నారి తల్లిదండ్రులకు వైద్య ఖర్చుల నిమిత్తం ఈ నగదును అందజేశారు.
జర్నలిస్ట్ కేపీ ఔదార్యం సామాజికవేత్త వంగూరి గంగిరెడ్డి
హలో షాద్ నగర్ వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేసి సమాచారం నిమిత్తంతోపాటు సామాజిక సేవల వైపు మళ్లించి అనేక మందికి ఆర్థిక సహాయ సహకారాలు అందజేస్తూ గ్రూపు సభ్యుల సహకారంతో దినదిన ప్రవర్తమానమై వెలుగు వెలుగొందుతున్నారని ప్రముఖ సామాజికవేత్త వంగూరి గంగిరెడ్డి ప్రశంసించారు. చిన్నారి పసికందు సహాయం నిమిత్తం మరో 50 వేల రూపాయలను వారికి అందజేయడం ఎంతో అభినందనీయమని ప్రశంసించారు.
సేవా కార్యక్రమాల్లో సాటి లేరు – కార్మిక నేత పినపాక ప్రభాకర్
సామాజిక సేవా కార్యక్రమాల్లో హలో షాద్ నగర్ గ్రూప్ ఔదార్యాన్ని ఎంత చెప్పుకున్న తక్కువేనని సేవా కార్యక్రమాల్లో జర్నలిస్టు కేపీకి ఎవరు సాటి రారని కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్ కొనియాడారు. చిన్నారి ప్రాణం నిలిపిన దాతలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజన్, జర్నలిస్టు కె.పి ఔదార్యంతో చిన్నారి ప్రాణాలు సకాలంలో నిలిచాయని పేర్కొన్నారు.
గ్రూపు సభ్యులు అభినందనీయులు – ఎంపీటీసీ భార్గవ కుమార్ రెడ్డి
హలో షాద్ నగర్ గ్రూప్ సభ్యులు ఎంతో అభినందనీయులని మధురాపురం ఎంపీటీసీ భార్గవ్ కుమార్ రెడ్డి తెలిపారు. చిన్నారి పసికందు ప్రాణం నిలిపిన దాతలు ఎంతో ప్రశంసనీయులని కొనియాడారు. గ్రూపు సేవలు మరింత విస్తృతం కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు జర్నలిస్ట్ కెపి, మహేష్, దీప్తి దంపతులు, జర్నలిస్టు ప్రవీణ్ యాదవ్, రైతు కాలనీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి శుక్రవర్ధన్ రెడ్డి, మల్లేష్ గౌడ్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.