జర్నలిస్ట్ కృష్ణపల్లిసురేష్:-కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి గ్రామంలో ఆషాడ పౌర్ణమి నుండి అశ్విని పౌర్ణమి వరకు నిర్వహించిన బుద్ధుని గ్రంథ పఠనం వర్షవాస్ సమాప్తి ముగింపు కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు వర్షవాస్ సమాప్తి ధమ్మదీక్షా మహోత్సవమునకు ఉపాసిక్ ఉపాసకులు బహు సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా దిగ్విజయంగా విజయవంతం చేశారు ధమ్మ ధ్వజారోహణ ఉదయం 10 గంటలకు గ్రామ అధ్యక్షుల స్వహస్థలచే బుద్ధ పూజ ఉదయం పది గంటల నుంచి సన్మాన కార్యక్రమం ఉదయం 11 గంటల నుండి ముఖ్య అతిథులు సందేశం మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదానము మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి ఖవాలీ కార్యక్రమము రాత్రి 7 గంటల నుండి బాబాసాగర్ బృందం వారిచే మహోత్సవం దద్దరిల్లిందని కమిటీ సభ్యులు తెలిపారు ముఖ్య అతిథులుగా జిల్లా కోవలక్ష్మి జడ్పిచైర్ పర్సన్ అనారోగ్యం బాగాలేక రాలేక పోయారని జడ్పిటిసి అజయ్ కుమార్ అన్నారు అంబేద్కర్ ఆశయ సాధనలు త్యాగాలు దేశానికే మరువలేని జ్ఞాపకా భవిష్యత్తు పురాణాలని గర్వకారణమని అన్నారు అలాగే జడ్పిచైర్ పర్సన్ వచ్చి వుంటే మహోత్సవం మరింతగా శోభ నిచ్చేదని సభలో ప్రస్తావించారు ఈ కార్యక్రమంలో నిర్వహణ సభ్యులు ఆనంద్ రావు మనోహర్ పుండలిక్ జాడీ రాజ్ కుమార్ శంకర్ సర్పంచ్ దుర్గం కమలాకర్ పలువురు మండల జిల్లా నాయకులు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు