బాల్య వివాహాలు దిశ యాప్ సైబర్ క్రైమ్ ల పై అవగాహన కలిపిస్తున్న ఎస్ఐ నాగార్జున రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్ అక్టోబర్13, మహానంది:
మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో మహానంది ఎస్ ఐ సి.సి. నాగార్జునరెడ్డి విద్యార్థినీ విద్యార్థులకు లోన్ యాప్, దిశ చట్టం, సైబర్ క్రైమ్, వాట్సాప్ లింకులు, బాల్యవివాహాలు తదితర కార్యకమాల గురించి గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై నాగార్జున రెడ్డి మాట్లాడుతూ సమాజంలో బాల్య వివాహాలను ప్రతి ఒక్కరూ నిర్మూలించాలని బాల్య వివాహాలపై అవగాహన నిర్వహించారు.బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. మహిళలకు రక్షణకు దిశా ఎస్‌ఒఎస్ యాప్ ఉపయోగపడే విధానాన్ని వివరించారు. చరవాణి వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఓటీపీ మోసాలు, లోన్ యాప్, వాట్సాప్ లింకులు,సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కే లక్ష్మణరావు, వైస్ ప్రిన్సిపాల్ పిర్ భాష, అంగన్వాడి కార్యకర్తలు కవిత ,వెలిశమ్మ గ్రామ మహిళా పోలీస్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.