సైబర్ నేరాలు డ్రగ్స్ బాల్య వివాహాలు దిశ యాప్ ల పై అవగాహన కార్యక్రమం
స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్ 11,మహానంది:
నకిలీ లోన్ యాప్‌లు, డ్రగ్స్ వ్యసనం, దిశ యాప్, సైబర్ నేరాలు, ర్యాగింగ్, బాల్య వివాహాలు, వీటిపైప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మహానంది ఎస్సై నాగార్జున రెడ్డి అన్నారు.మహానంది మండలంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై నాగార్జున రెడ్డి మాట్లాడుతూ ర్యాగింగ్, బాల్య వివాహాలు, డ్రగ్స్, సైబర్ నేరాలు, ప్రమాదాలు జరిగినపుడు 100కు లేదా 1903 కు డయల్ చేయాలన్నారు.ఇంటర్నెట్‌నువినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొబైల్ ఫోన్ హ్యాక్, క్రెడిట్ కార్డు సమాచారాన్ని చోరీ, ఓటీపీ మోసాలు, లోన్ యాప్, మెయిల్స్, సైబర్ దాడుల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలోప్రధానోపాధ్యాయురాలు అంబమ్మ, ఉపాధ్యాయుడు హనుమంతు నాయక్, మహానంది పోలీస్ సిబ్బంది ఓబులేసు రవి, తదితరులు పాల్గొన్నారు.