శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీలోని నగదు చోరీ

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీలోని నగదు చోరీ

స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్ 11,మహానంది:

మహానంది మండలం గాజులపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం రాత్రి ఒక దొంగ ఆలయం ముందు పడుకున్నట్టు నటిస్తూ ఆలయ సమీపంలోని వెలుతురుగున్న లైట్ ఆపివేసి ముందు భాగంలో తలుపును పగలగొట్టి లోపలికి వెళ్లి భక్తులు వేసే కానుకల హుండీలోని నగదు మొత్తం రాత్రి దోచుకెళ్ళాడు.రోజూలాగానే సోమవారం రాత్రి ఆలయం మూసేసి తాళాలు వేశారని ఆలయ కమిటీ, శ్రీ సేవా సమితి కమిటీ వారు తెలిపారు.మంగళవారం ఉదయం వచ్చి చూడగా ఆలయాల తలుపులు పగలగొట్టి హుండీలోని నగదు దోచుకెళ్ళినట్లు తెలిపారు. ఈ విషయాన్ని మహానంది ఎస్ఐ నాగార్జున రెడ్డికి తెలుపగా రోడ్ సేఫ్టీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!