సైనిక లాంఛనాలతో వీర జవాన్ మహేష్ కు అంతిమ వీడ్కోలు
స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్ 10,మహానంది:
పంజాబ్ ఇండియన్ ఆర్మీలో 4 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న వీర జవాన్ మహేష్ అక్టోబర్ 9వ తేదీన మహానంది మండల పరిధిలోని గాజులపల్లి-గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.సోమవారం
మృతదేహాన్ని తన స్వగ్రామమైన మహానంది మండలం ఆర్ఎస్ గాజులపల్లి గ్రామానికి తీసుకునిరాగ కర్నూల్ గ్రూప్ ఆంధ్ర 28NCC బెటాలిన్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం ఆర్మీ అధికారులు వీర జవాన్ మహేష్ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.నంద్యాల తాలూకా సిఐ మురళీమోహన్, మహానంది ఎస్సై నాగార్జున రెడ్డి, ఆర్ఎస్ గాజులపల్లి సర్పంచ్ అస్లాం భాష,వీర జవాన్ మహేష్ పార్థివదేహం వద్ద పూల గుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. వీర జవాన్ మహేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరంవీర జవాన్ మహేష్ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరిగాయి.పార్థివ దేహంపై జాతీయ జెండాను ఉంచి నివాళులర్పించారు.వీర జవాను తుది వీడ్కోలు పలకడానికి జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు.