గడప గడపకు..
* చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మహా పాదయాత్ర
* ప్రజల నుంచి విశేష స్పందన
* లివర్ వ్యాధి బాధితునికి భరోసా
* పాదయాత్రకు మద్దతుగా పాల్గొన్న తిరుపతి మేయర్ శిరీష
* ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ..
* ప్రజా సమస్యలను ఆరా తీస్తూ ముందుకు
* ఆప్యాయంగా పలకరిస్తూ.. ప్రజలతో మమేకమవుతూ..
* తిరుమలనగర్ పంచాయతీలో పర్యటన
తిరుపతి,
చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు, తిరుపతి రూరల్ ఎంపీపీ మోహిత్ రెడ్డి చేపట్టిన గడప గడపకు మహా పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. శనివారం రెండోరోజు పాదయాత్రలో భాగంగా తిరుమల నగర్ పంచాయతీలో పర్యటించారు. రాత్రి తుడ క్వార్టర్స్ లో బస చేసిన మోహిత్ రెడ్డి శనివారం ఉదయం 7 గంటలకు పాదయాత్రను ప్రారంభించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఆయా కుటుంబానికి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ.. గ్రామంలో సమస్యలు తెలుసుకుంటూ సత్వరం పరిష్కరించాలని అధికారులకు సూచించారు. శేషాచలనగర్ లో భూగర్భ డ్రైనేజీ ఇబ్బందిగా ఉందని ప్రజలు చెప్పడంతో తక్షణం స్పందించి మరమ్మతులకై రూ.6 లక్షల నిధులను మంజూరు చేశారు. లివర్ సమస్యతో బాదపడుతున్న వినోద్ కుమార్ కు భరోసా కల్పించారు. మెరుగైన చికిత్స అందించాలని స్విమ్స్ వైద్యులతో ఫోన్ లో చర్చించారు. మెరుగైన వైద్యం అందుతుందని బాధితునికి సూచిస్తూ ధైర్యం కల్పించారు. ప్రతి ఇంటి ముందు మోహిత్ రెడ్డికి మహిళలు ఆప్యాయంగా స్వాగతం పలికారు. ప్రజలతో మమేకమై అమ్మ, అక్క, అన్న, అవ్వ, తాత బాగున్నారా..! అంటూ సంబోధిస్తూ.. ఆప్యాయంగా పలుకరిస్తూ పాదయాత్ర చేస్తూ ముందుకు సాగారు.
ఈ సందర్భంగా *మోహిత్ రెడ్డి* మీడియాతో మాట్లాడుతూ.. గడపగడపలో జగనన్న మూడేళ్ళుగా అందించిన సంక్షేమం కనపడుతోందన్నారు. గతంలో నాయకులు అంతా ఎన్నికలపుడు మాత్రమే కనిపించే వారు.. ఇప్పుడు ప్రజల వద్దకే అధికారులు, ప్రజా ప్రతినిధులు వస్తుండటం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగనన్న, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు. కాలనీలలో సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం పాదయాత్రలో సచివాలయ ఉద్యోగులు, మండల స్థాయి అధికారులు అంతా పాల్గొంటున్నారని వివరించారు.
మోహిత్ రెడ్డి మహా పాదయాత్రకు మద్దతుగా విచ్చేసిన *తిరుపతి మేయర్ శిరీషా* మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో గడపగడపకు మన ప్రభుత్వం జోరుగా సాగుతోందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా.. మీ కుటుంబానికి ఈ సాయం చేశాము.. ఈ సంక్షేమ పథకం ఇచ్చామని ధైర్యంగా చెప్పలేదన్నారు. మూడేళ్ళ జగనన్న పాలనలో ఒక్కొక్క కుటుంబం రూ.లక్షల సాయం అందుకున్నారన్నారు. ప్రజల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం ప్రజా ప్రతినిధులు అందరూ ప్రజల వద్దకు వస్తున్నారని తెలియజేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో గడపగడపకు మన ప్రభుత్వం మహా పాదయాత్రగా చేయడం అభినందనీయమని తెలిపారు. ప్రజల పట్ల చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చూపించే ఆప్యాయత, అనురాగం ప్రజా సమస్యల పరిష్కారంకై ప్రదర్శించే తెగువ, అధికారులతో మెలుగుతున్న తీరు ప్రశంసనీయం అన్నారు. ఈ రాష్ట్రంలో ఒక గొప్ప నాయకుడుగా ఎదుగుతారని ఆకాంక్షించారు.