మహానంది పుణ్య క్షేత్రంలో డ్రోన్ కలకలం
స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్08, మహానంది:
మహానంది పుణ్యక్షేత్రంలో శనివారం కొందరు డ్రోన్ కెమెరాతో వీడియోలు, ఫోటోలు తీయడం కలకలం రేపింది.గుర్తుతెలియని వ్యక్తులు డ్రోన్ కెమెరాతో మహానంది ఆలయాలను చిత్రీకరించారు. దేవస్థానం అధికారుల అనుమతులు లేకుండా ఫోటోలు వీడియోలు తీశారని భక్తులు ఆరోపిస్తున్నారు. భక్తులు ఈ విషయం గురించి ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు.దీనిపై వెంటనే ఎస్ఐ ఎస్సై నాగార్జున రెడ్డి విచారణ చేపట్టారు.