యువకుని హత్య కేసును చెందించిన పోలీసులు

యువతి కోసం తాగిన మైకంలో స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో తోటి స్నేహితులు యువకుడిని హత్య చేసారు. పట్టణ సర్కిల్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శనివారం మీడియాకు తెలియజేసిన వివరాల ప్రకారం చిలకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌరవరం డి.వి.ఆర్ కెనాల్ లో ఆరో తేదీ ఉదయం మృతదేహం ఉన్నట్లు తెలిసిన సమాచారం ప్రకారం అక్కడకు వెళ్ళగా మృతుడు పాపట్ల వంశీ అనే యువకుడు గా గుర్తించామని,మృతుడి నాయనమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసామని తెలియజేసారు. కేసు విచారణలో మృతుడు అతని స్నేహితులు ట్రాక్టర్, జెసిబి డ్రైవర్ లుగా పని చేస్తారని, దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన మృతుడు అతని స్నేహితులు ఐదుగురు యజమాని వద్ద దసరా మామూలు తీసుకొని ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన వల్లబి లో మద్యం, ఆహార పదార్థాలు తీసుకొని గండ్రాయి ఎన్ఎస్పి కెనాల్ వద్ద ఫుల్లుగా మద్యం తాగి పార్టీ చేసుకున్నారని, తర్వాత ఓ యువతి విషయంలో మృతునికి అతని స్నేహితుడు జగదీష్ కి గొడవ జరిగిందని, అనంతరం మిగిలిన స్నేహితుల సహకారంతో జగదీష్ మృతుడిని తలపై కొట్టడం వల్ల బలమైన గాయం అవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయాడని. అనంతరం మృతుడిని ఒంటిపై బట్టలు తీసివేసి ఎన్ఎస్పీ కాలవ లో పడి వేశారని, సుమారు 20 కిలోమీటర్లు కొట్టుకొచ్చిన మృతదేహం గౌరవరం వద్ద దొరికిందని, కేసు అన్ని కోణాలలో విచారించి హత్యకు పాల్పడిన ఐదుగురిలో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించడం జరుగుతుందని, ఓ ముద్దాయి మైనర్అని, అతనిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని సర్కిల్ ఇన్స్పెక్టర్ అడపా నాగమురళి తెలియజేసారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!