స్టూడియో10 టీవీ అక్టోబర్ 08
అరటి తోటలను పరిశీలించిన రైతు, ప్రజా సంఘాల నాయకులు..అరటి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి..
ఇటీవల కురుస్తున్న వర్షాలకు కంభం చెరువు ఆయకట్టు కింద వేసిన అరటి పంట తీవ్రంగా నష్టపోయిన విషయం విధితమే ఈ మేరకు శనివారం పలు ప్రజా సంఘాల నాయకులు అరటి రైతులను కలిసి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ రోజుల తరబడిగా వర్షపు నీరు పొలాలలో నిలిచిపోవడం వల్ల దిగుబడి తీవ్రంగా తగ్గే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది అరటి పంట వేసిన రైతులకు పంట నష్టపోయినప్పటికి ప్రభుత్వం నుండి ఎటువంటి నష్టపరిహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యానవన శాఖ అధికారులు నష్టపరిహారం జరిగినట్టు వ్రాసుకొని పోతున్నారు గాని తమకు మాత్రం ఇప్పటికీ నష్ట పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అరటి రైతులకు ప్రభుత్వం నష్టపరిహారంగా ఎకరాకు రూ 50 వేలు చెల్లించాలని రైతు సంఘం, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు తోట తిరుపతి రావు,అక్బర్, జాకీర్, సిఐటియు నాయకులు ఎం వెంకట్ బాలయ్య ఆవాజ్ కమిటీ జిల్లా నాయకులు ఎం ఎస్ బేగ్, రైతులు పాల్గొన్నారు.