ప్రమాదాలు నివారించేందుకు పిచ్చి మొక్కలు తొలగించిన పోలీసులు..
కొమరోలు లో అమరావతి కడప రాష్ట్రీయ రహదారి మరియు గిద్దలూరు ఎడమకల్లు రహదారికి ఇరువైపులో ఉన్న పిచ్చి మొక్కలను శనివారం నో యాక్సిడెంట్ డే కార్యక్రమంలో భాగంగా డోజర్ సహాయంతో తొలగించారు. ఎస్ఐ సాంబశివయ్య ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది కలిసి పిచ్చి మొక్కలు తొలగించారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్ఐ సాంబశివయ్య తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.