అసంపూర్తిగా హైవే పనులు.. నిత్యం ప్రమాదాలే…
ప్రమాదాలు నిత్యకృత్యం అయినా చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు
కంభం పట్టణంలో అమరావతి అనంతపురం జాతీయ రహదారి పనులు అసంపూర్తిగా నిర్వహించడంతో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో కంభం పట్టణంలోని స్థానిక వై జంక్షన్ లో బస్టాండ్ కు వెళ్లే రహదారిలో డ్రైనేజీ కాలువ హోల్ మూయకపోవడంతో ఓ ద్విచక్ర వాహనదారుడు బైక్ తో సహా డ్రైనేజీ హోల్ లో పడడం వల్ల తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రున్ని కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు రాచర్ల మండలం కొత్తపల్లి గ్రామస్తుడిగా సమాచారం.. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.