జగ్గయ్యపేట పట్టణంలోని, బస్టాండ్ నుంచి విజయవాడ నగరానికి అల్ట్రా ఎక్స్ ప్రెస్ సర్వీసు(పల్లె వెలుగు) నాలుగు నూతన బస్సు సర్వీస్ లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు సామినేని ఉదయభాను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్ టి సికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, గతంలో పోలిస్తే ఇప్పుడు చాలా సర్వీసులు ప్రజలకు అందుబాటులో తీసుకుని వచ్చామని, అలాగే పండుగ పేరు తో చార్జీలు పెంచి నిలువు దోపిడీ చేసే విధానానికి చరమగీతం పాడామని, డిపోల లో గానీ, బస్టాండ్ లలో గానీ అన్ని వసతులు అందుబాటులో ఉంచామని, ప్రజలకు మెరుగైన సేవలను అందించాడానికి కావాల్సినవి అన్ని చేస్తున్నామని తెలిపారు.