మంచినీటి కొళాయి లీకేజీ ని బాగు చేయరూ?
గిద్దలూరు స్థానిక పట్టణంలోని శ్రీనివాస థియేటర్ వెనుక వైపు గల మంచినీటి కొళాయి లీకేజీ అవుతూ త్రాగు నీరు వృధాగా పోతున్నది. ఈ కొళాయి వద్ద నిత్యం వందల మంది త్రాగునీరును తీసుకుని వెళుతూ ఉంటారు. ఈ కొళాయి లీకేజీ అవుతూ మరియు అపరిశుభ్రంగా పాచి పట్టి ఉన్నది. సంబంధిత అధికారులు పట్టించుకొని మంచినీటిని వృధాగా పోకుండా అరికట్టాలని అలాగే కొలాయిచుట్టూ పట్టిన పాచిని కూడా శుభ్రం చేయాలని పట్టణ ప్రజలు కోరుచున్నారు.