గంట వ్యవధిలో బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చిన పోలీసులు
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో తన తల్లిదండ్రుల వద్ద నుంచి తప్పిపోయి బస్టాండ్ ఆవరణలో తిరుగుతున్న అజేష్ అనే మూడు సంవత్సరాల బాలుడిని పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియా ద్వారా బాలుడు తప్పిపోయి తిరుగుతున్నాడని తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని బాలుడిని తమ సంరక్షణలో ఉంచుకున్నారు. తర్వాత ఆ బాలుడిని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. సీఐ రాజేష్ కుమార్, కంభం ఎస్సై నాగమల్లేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్లా బాలుడిని తల్లిదండ్రుల వద్దకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. తమ బాలుడిని సురక్షితంగా గంట వ్యవధిలో అప్పగించిన కంభం పోలీస్ వారికి ఆ బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.