వైయస్సార్ బీమా పథకం కింద 10,000 ఆర్థిక సాయం
స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్04, మహానంది:
వైయస్సార్ బీమా పథకం కింద పదివేల రూపాయల ఆర్థిక సహాయ సహకారాలను అందజేసినట్లు ఇన్చార్జి ఎంపీడీవో శివ నాగ జ్యోతి మంగళవారం తెలిపారు. మహానంది మండలం బొల్లవరం గ్రామానికి చెందిన గుండా పార్వతి అనే మహిళ సహజ మరణం పొందడంతోవైయస్సార్ బీమా పథకం కింద పదివేల రూపాయల ఆర్థిక సహకారం నామిని అయినా మృతురాలి కుమారుడు పరశురాంకు అందజేసినట్లు తెలిపారు.