వన్య ప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
స్టూడియో 10 టీవీ న్యూస్,అక్టోబర్ 04,మహానంది:
వన్య ప్రాణులసంరక్షణ అందరి బాధ్యతని చలమ రేంజ్ అధికారి ఈశ్వరయ్య తెలిపారు.మంగళవారం వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలలో భాగంగా మహానంది మండలం ఆర్ఎస్ గాజులపల్లి గ్రామంలో ర్యాలీని నిర్వహించి, మొక్కలను నాటి, జంతు సంరక్షణ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చలమ రేంజ్ అధికారి ఈశ్వరయ్య మాట్లాడుతూ.. అడవులు అభివృద్ధి చెందాలంటే వన్య ప్రాణులను కాపాడుకోవాలన్నారు. నల్లమల అటవీ ప్రాంత సమీపంలో ఉన్న గ్రామాల్లో ప్రజలు పంటలు సాగు చేసే సమయంలో అడవి జంతువులు సంచరిస్తూ ఉంటాయి.ఆ సమయంలో వాటికి హాని తలపెట్టకుండా దూరంగా వెళ్లే విధంగా చూడాలన్నారు.జంతువులను వేటాడిన చంపిన కఠిన చర్యలు ఉంటాయన్నారు. వన్య ప్రాణులను సంరక్షించుకోవడం వల్ల వాతావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చు అన్నారు.ఈ వారోత్సవాల ద్వారా ప్రజలకు వన్యప్రాణుల సంరక్షణ గురించి అవగాహన కల్పించడం వల్ల ఎంతో దోహదపడుతుందని. అంతేకాకుండా మన చుట్టూ ఉండే జీవ జాతులను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.ప్రతి ఒక్కరూ సమష్టిగా జీవ వైవిధ్యం కాపాడుకోవాలన్నారు. వృక్ష సంపదను, వన్యప్రాణులను రక్షించుకుని అంతరించి పోకుండా భావి తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అస్లాం భాష, డిఆర్ఓ రాజు, సెక్షన్ ఆఫీసర్లు శ్రీనివాసులు, ఎల్లమ్మ,ఫారెస్ట్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.