మహాత్మా గాంధీ జాతీయ అవార్డు అందుకున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి
గత 25 సంవత్సరాల నుండి పలు రకాల నిరంతర సేవలో ఉన్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి సంఘసేవకులు సేవలను గుర్తించిన మార్కాపురం పట్టణానికి చెందిన ఆదరణ వెల్ఫేర్ సొసైటీ వారు మహాత్మా గాంధీజాతీయ పురస్కారానికి ఎంపిక చేసిన విశయమ్ తెలిసిందే రెడ్డి కి ఈ పురస్కారాన్ని మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అవార్డ్ మేమెంటోతో ఆదివారం రాత్రి సినీ హాస్యనటులు డాక్టర్ గౌతమ్ రాజు చేతుల మీదుగా ఘన సన్మానమ్ పొందారు. ఆదరణ వెల్ఫేర్ సొసైటీ సంస్థ చైర్మన్ గొట్టెముక్కల చెన్నకేశవులు మాట్లాడుతూ బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు మార్కాపురం ప్రాంతంలో కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్త సేవలు విస్తరింప చేయాలని కోరుతూ నారాయణరెడ్డి నిస్వార్ధ సేవలుఅభినందనీయమన్నారు.
సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఆదర్షం అన్నారు నారాయణరెడ్డి లాగా నిస్వార్థంగా సేవా కార్యక్రమాలు చేసేవారు సమాజానికి అవసరమన్నారు. గిద్దలూరు పట్టణంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు స్నేహితులు ఆత్మ బంధువులు అవార్డు అందుకున్నందుకు అభినందించారు. బి యస్ నారాయణరెడ్డి మాట్లాడుతూ అవార్డ్ అందించిన ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ గొట్టె ముక్కల చెన్నకేశవులుకు ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. సినీ హాస్యనటులు డాక్టర్ బి గౌతమ్ రాజు చేతులమీదుగా అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. నేను సమాజసేవ చేయడానికి అవసరమైనప్పుడు మా తల్లి_తండ్రులు, మా తమ్ముళ్ళు, మా మేనమామ కొడుకులు, స్నేహితులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సభ్యుల ఆర్థిక సహాయం చేయడం తో ఇంత గొప్ప సేవచేస్తున్నానన్నారు. వారికి, పత్రికా విలేఖరులకు, టివీ విలేకరులకు స్నేహితులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమములో ఆదరణ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.