వరిమడులను తలపిస్తున్న రోడ్లు
రాచర్ల మండలంలోని బీసీ కాలనీలో ఏడవ వార్డు ప్రాంతాల రోడ్లు వరి మడులను తలపిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లన్నీ బురదమయంగా మారి కనీసం నడిచేందుకు కూడా అవకాశం లేకుండా ఉందని స్థానిక ప్రజలు అంటున్నారు. వర్షపు నీరు కూడా ఆ రోడ్లలో నిలువ ఉండి ఈగలు దోమలు వచ్చి చేరుతున్నాయని అన్నారు.ఇక వాహనదారులు ఈ రోడ్లలో ప్రయాణించాలంటే ఆందోళన చెందుతున్నారని ఒకసారి అదుపుతప్పి కింద పడిపోతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి దారుణంగా ఉన్న ఈ రోడ్లను బాగు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.