విద్యార్థి ఉన్నత చదువుకు ఆర్థిక సహాయం : చేవెళ్ల వార్త దినపత్రిక రిపోర్టర్ బెగరి వెంకటేష్
తనకు అత్యంత సన్నిహితుడు, మొయినాబాద్ మండల్ వార్త దినపత్రిక రిపోర్టర్ మాసగల్ల లక్ష్మణ్ దాస్ కుమారుడు అక్షయ్ రాజ్ ఇంజనీరింగ్ చదువుటకు చేవెళ్లకు చెందిన రంగారెడ్డి జిల్లా వార్త దినపత్రిక జిల్లా రిపోర్టర్ బేగరి వెంకటేష్ 50,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు.గత ఏడాది ఆగస్టు 20 న కరోనా అనే భయంతో మొహినబాద్ మండల్ వార్త దినపత్రిక రిపోర్టర్ మాసగల్ల లక్ష్మణ్ అకాల మరణం చెందిన విశయం తెలిసిందే.
విద్య నభ్యసించటకు ఆర్థిక ఇబ్బందులూ ఉండకూడదనే ఉద్దేశంతో మాసగళ్ళ లక్ష్మణ్ కుటుంబ ఆర్థిక సమస్యలు బెగరి వెంకటేష్ దృష్టికి రాగ, వెంటనే స్పందించిన వెంకటేశ్ అక్షయ్ రాజ్ ఇంజనీరింగ్ చదువుకు ఆర్ధిక సహాయం అందించారు. ఈ సందర్బంగా వెంకటేష్ మాట్లాడుతూ ఆర్థిక స్తోమత లేని ప్రతి పేద విద్యార్థి చదువుల్లో ఉన్నత స్థాయికి చేరాలని, అన్ని దానాల్లోకెల్లా విద్యా దానం గొప్పదని తెలియజేస్తూ విద్యను మించిన ఆస్తి లేదన్నారు. నగదు దానం చేస్తే తగ్గి పోవచ్చు కానీ విద్యా దానం చేస్తే ఎంతో మంది జీవితాలను వెలిగిస్తుందని, విద్యకు ఆర్థిక స్తోమత అడ్డు కాకుడదనే ఉద్దేశంతో అక్షయ్ రాజ్ చదువులకై సహాయం అందించానని అన్నారు.
అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పది అంటారుకానీ, అదే ఆహారం తీసుకోవాలంటే నేటి కాలంలో విద్య, విద్యతో పాటు ఉపాధి చాలా అవసరం. ఉపాధి అవకాశాలు రావాలంటే విధ్య జ్ఞానం అవసరమని, నేడు చాలా కుటుంబాల్లో ప్రతిభావంతులైన అనేక మంది పిల్లలున్నా సరైన ఆర్థిక స్థోమత లేక చితికి పోతున్న కుటుంబాలెన్నో ఉన్నాయని వారికి వెంకన్న లాంటి దయార్ద్ర హృదయులు చదువుకొనుటకు విద్యాదానం చేయాలని కోరారు డాక్టర్ డి భీంరాజ్. తన ఇంజనీరింగ్ ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం చేసిన వెంకన్నకు ధన్యవాదాలు తెలిపిన అక్షయ్ రాజ్ తప్పకుండా వారి సేవను గుర్తించు కుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల పి ఎ సిఎస్ డైరెక్టర్ నత్తి కృష్ణారెడ్డి, చేవెళ్ల చెందిన వెంకట్ రెడ్డి, మొహినబాద్ వార్త రిపోర్టర్ కర్రోల్ల శ్రీధర్ పాల్గొన్నారు.