సమస్యల పరిష్కారానికి గ్రామ సభ వేదిక
స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్ 02, మహానంది:
మహానంది మండలం మేజర్ గ్రామపంచాయతీ గాజులపల్లి గ్రామంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రామ సభను సచివాలయం 1 వద్ద సర్పంచ్ చంటి అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా 153 వ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక గ్రామ సచివాలయం 1లో బాపూజీ చిత్ర పటానికి వైసిపి నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి, ఎంపీటీసీ చౌటుపల్లి నరసింహులు, పంచాయతీ కార్యదర్శి మమ్మద్ ఇర్ఫాన్, పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కొండా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ అడుగుజాడల్లో నేటి యువతరం నడవాలని, అహింసా మార్గంతోనే స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి గాంధీ అని అన్నారు. పంచాయతీ కార్యదర్శి మహామ్మద్ ఇర్ఫాన్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవల గురించి అదే విధంగా స్వాతంత్ర సిద్దిని గురించి గుర్తు చేశారు. అనంతరం గ్రామంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రామ సభను నిర్వహించారు. గ్రామ సభలో ప్రజా సమస్యల గురించి తెలుసుకొని వారి సమస్యల పరిష్కారానికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి కృషి చేస్తామని కొండా మధుసూదన్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి,ఎంపీటీసీ చౌటుపల్లి నరసింహులు,పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ ఇర్ఫాన్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ అజయ్ కుమార్ రెడ్డి, వెల్ఫేర్ అసిస్టెంట్ లింగమయ్య,డిజిటల్ అసిస్టెంట్ రవికుమార్,సర్పంచ్ చంటి,వార్డు మెంబర్ సభ్యులు, మాబువలి,నారాయణ,మాజీ ఎంపిటిసి వెంకటరమణ,గ్రామ నాయకుడు బోజ్జయ్య,సచివాల సిబ్బంది,ఆశా వర్కర్లు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.